LORD HAS GIVEN ME OPPORTUNITY TO SERVE DEVOTEES TWICE-NEW JEO_ టిటిడి తిరుపతి జెఈవోగా శ్రీ బి.లక్ష్మీకాంతం బాధ్యతల స్వీకరణ
Tirumala, 10 February 2019: Sri B Lakshmikantham who has assumed charges as the new Joint Executive Officer of TTD for Tirupati said that Sri Venkateswara Swamy has blessed him to render service to pilgrims not once but twice.
Speaking to media persons outside Tirumala temple after taking charges as JEO suceeding Sri P Bhaskar, he said, usually we feel our life has been blessed even if we get an opportunity to stand before lord for a few seconds. Lord has given me opportunity to serve in thia reputed institution two times.
My top priority is to ensure hassle free darshanam to scores of pilgrims thronging TTD temples and to save the crores of land properties of Lord, he added.
Earlier after having darshanam of Lord he was offered Vedasirvachanam in Ranganayakula mandapam and DyEOs sri Harindranath, Sti Balaji, Smt Malleswari offered him theertha prasadam and laminated photo of lord.
VGO Manohar was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
టిటిడి తిరుపతి జెఈవోగా శ్రీ బి.లక్ష్మీకాంతం బాధ్యతల స్వీకరణ
ఫిబ్రవరి 10, తిరుమల, 2019: టిటిడి తిరుపతి జెఈవోగా శ్రీ బి.లక్ష్మీకాంతం ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల జెఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడిని ప్రపంచంలోనే ఉన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. భక్తులకే మొదటి ప్రాధాన్యత అని, వారికి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. సంతృప్తికరంగా ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తుల ముఖంలో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. మానవసేవే మాధవసేవ అని, ప్రతి ఒక్కరూ తోటి మనుషులకు, సమాజానికి ఏదో ఒక సాయం చేయాలని కోరారు.
ఆలయంలో భక్తులకు ఒకసారి 7 సెకన్లు మాత్రమే దర్శనం లభిస్తుందని, అలాంటిది తనకు ఇక్కడ రెండుసార్లు సేవ చేసే అవకాశం వచ్చిందని, శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. 2010-11లో ఇక్కడ విధులు నిర్వహించానని, ఎనిమిదేళ్ల తరువాత తిరిగి సేవాభాగ్యం కలిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.