SILYESTHAKANYASAM PERFORMED AT AMARAVATHI_ అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి వైభవంగా ప్రథమ శిలేష్టకాన్యాసం

Amaravathi, 10 February 2019: The first stone laying ceremony, Pradhama Silyesthakanyasam was performed at Amaravathi, the capital city of Andhra Pradesh on Sunday in the auspicious Meena Lagnam between 9am and 10am. Rituals like Chaturveda Parayanam, Go Gana Nivedanam, Purnahuthi and Veda Aschirvanam were performed.

It may recalled that on January 31, the Bhookarshanam and Ankurarpanam, fetes for the Sri Venkateswara Divyakshetram which is going to come up at Rs.150crores were performed over the hands of Honourable CM of AP Sri N Chandra Babu Naidu.

From February 1 till 6, various religious events like chaturveda parayanam, vasanthotsavam, snapana tirumanjanam were performed. While from February 7 to 10, Astottara Satakundatmaka Srinivasa Yagam was performed seeking the prosperity of humanity in general and state in particular.

The temple along with Dhyana mandiram, Sri Dhamam, Pushkarani etc.will be constructed in two years.

Chief Vigilance and Security Officer Sri Gopinath Jetti, SE Sri A Ramulu, special grade DyEO Sri Rajendrudu and other officers took part in the program. The religious staff including Chief Priest of Tirumala temple Sri Venugopala Dixitulu, Agama advisors Sri Sundaravadanacharyulu, Sri Mohanarangacharyulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి వైభవంగా ప్రథమ శిలేష్టకాన్యాసం

ఫిబ్రవరి 10, అమరావతి, 2019: రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల నడుమ మీన లగ్నంలో ప్రథమ శిలేష్టకాన్యాసం వైభవంగా జరిగింది. పునాది రాయి వేయడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం చతుర్వేద పారాయణం, గోగణ నివేదనం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు.

ఆలయ నిర్మాణ స్థలంలో జనవరి 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా భూకర్షణ, బీజవాపన కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం కోసం జనవరి 28వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి 14 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1న వసంతోత్సవం, ఫిబ్రవరి 2న స్నపనతిరుమంజనం, ఫిబ్రవరి 3 నుండి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పారాయణం చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం నిర్వహించారు.

కాగా, ఇక్కడ ప్రధాన శ్రీవారి ఆలయం రెండేళ్ల లోపు పూర్తి అవుతుంది. ఇందులో భాగంగా అంతరప్రాకారం, బాహ్యప్రాకారం, మహారాజగోపురం, కల్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం తదితర నిర్మాణాలు పూర్తవుతాయి. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రాబోవు రోజుల్లో శ్రీధామం, ధర్మమందిరం, ధ్యానమందిరం, పద్మసరోవరం, యోగా కేంద్రం, దివ్యారామం తదితర నిర్మాణాలు చేపడతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఎ.వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు శ్రీ ఎన్‌ఎకె.సుందరవరదన్‌, శ్రీ ఎన్‌వి.మోహన రంగాచార్యులు, శ్రీ ఎ.అనంతశయన దీక్షితులు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఎస్‌ఇ శ్రీ ఎ.రాములు, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఇఇ శ్రీ ప్రసాద్‌, ఎఈవో శ్రీ గోవిందరాజన్‌, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ బి.ఆర్‌.గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.