LORD KALYANA VENKATESWARA TAKES RIDES ON FLOAT _ తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

Tirupati, 4 February 2020: On the third day evening on Tuesday, Sri Kalyana Venkateswara Swamy took out celestial ride on float.

Along with Sridevi and Bhudevi, the Lord took five rounds on the finely decked float on third day evening as a part of the ongoing Teppotsavams in Sri Govindaraja Swamy temple.

DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy and other officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

తిరుపతి, 2020 ఫిబ్రవరి 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.  అదేవిధంగా బుధ‌వారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీ కృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
       
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శ‌ర్మ‌, శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.