LORD KAPILESWARA SWAMY ATOP BHOGI THERU _ వేడుకగా భోగితేరు ఊరేగింపు

GRAND MAHASHIVARATRI CELEBRATIONS AT SRI KAPILESWARA SWAMY TEMPLE

Tirupati, 08 March 2024: As part of the Brahmotsavam of Sri Kapileswaraswamy in Tirupati, the Mahashivaratri festival was celebrated with utmost devotional fervour on Friday.  Keeping in mind the rush of devotees, special queues, shelters and parking areas have been arranged by TTD.

Sarvadarshan started at 6 am in the temple.  A large number of devotees had darshan of Sri Kapileswara Swamy and Goddess Sri Kamakshi Devi.

BHOGI THERU PROCESSION AS A CELEBRATION

As part of Brahmotsavam, the Bhogi Theru procession was held from 7 to 9 am.  Rathotsavam was conducted in the city streets amidst the blare of bhajan mandals, bhajans and Mangala instruments.

After that, from 10 am to 11 am, the priests conducted Snanathiramanjanam.  Sri Somaskandamurthy and Sri Kamakshi Devi were rendered Abhishekam with milk, curd, honey, fruit juice and sandalwood.  

KALYANAM OF SIVA PARVATI ON MARCH 9

As part of the Brahmotsavam of Lord Kapileswara along with Shri Kamakshi, the Kalyana Mahotsavams of Siva Parvati will be held on Saturday, the day after Mahashivratri. 

This Kalyanatsavam is organized as Arjitaseva from 6 pm to 7 pm.  Grihastha devotees (two) can participate in Kalyanotsava by paying Rs.250/- and buying ticket.  

Temple Deputy EO Sri Devendra Babu, other staffs, devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు

తిరుప‌తి, 2024, మార్చి 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. పెద్దసంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.

వేడుకగా భోగితేరు ఊరేగింపు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వ‌హించారు.

ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

ఆ తరువాత ఉదయం 10 నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.

మార్చి 9న శివపార్వతుల కల్యాణం

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శ‌నివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.