CHAKRASNANAM HELD _ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Tirupati, 08 March 2024: Chakrasnanam was observed on the last day of the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram on Friday.

Priests, officials and devotees took bath on a large scale.

From 8.30 am to 9.30 am in front of the Pushkarini, Sridevi and Bhudevi along with Sri Kalyana Venkateshwaswami and Sri Sudarshan Chakratthalwar were rendered Snapanam.

After that Chakrasnanam was performed.

On this occasion, TTD Veda Parayanamdars recited Upanishad Mantras, Dashashanti Mantras, Panchasukta Mantras like Purushukta, Srisukta, Bhusukta, Nilasukta, Vishnusukta, Divyaprabandha and related Vedas during Abhishekah.  In this ceremony, garlands of the best species of each type of flower were decorated for Swami and Ammavar.

The Brahmotsavam ends with Dhwajavarohanam at 6pm to 7 pm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

– ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి, 2024 మార్చి 08: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం ఉద‌యం 9.45 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది.

ముందుగా కంకణ బట్టార్ శ్రీ శేషాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీచెంగ‌ల్రాయులు, శ్రీ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల విశేషాలు :

•⁠ ⁠ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ భానుస్వామి ఆధ్వ‌ర్యంలో రోజుకు 10 నుండి 15 వేల మంది భక్తులకు ప‌ది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప‌ర్వ‌దినాల‌లో 20 వేల నుండి 25 వేల మందికి ప్ర‌సాదాలు అందించారు.

•⁠ ⁠ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ ఏర్పాటుచేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

•⁠ ⁠బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో 1100 మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1600 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

•⁠ ⁠ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 10 టన్నుల పుష్పాలు వినియోగించారు. 50 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.

•⁠ ⁠ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప్ర‌త్యేక దినాల‌లో 25 మంది అద‌న‌పు సిబ్బంది సేవ‌లందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.