LORD KAPILESWARA SWAMY ON CHANDRAPRABHA VAHANAM_ శ్రీ కపిలేశ్వరాలయంలో చంద్రప్రభ వాహనం
Tirupati, Feb: 7,2018: Processional deity of Lord Siva along with Goddess Parvathi were taken out in procession on Chandra Prabha Vahanam as part of ongoing Annual brahmotsavam in Sri Kapileswara Swamy Temple in Tirupati on tuesday evening.
Among others DyEO Sri Subramanyam, AEO Sri Sankar Raju, Chief priest Sri Maniswamu, AVSo Sri Gangaraju, Supt Sri Raj Kumar, Temple inspector Sri Narayana and Sri C Muralikrishna participated in the event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో చంద్రప్రభ వాహనం
తిరుపతి, 2018 ఫిబ్రవరి 07: శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహించాడు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.