LORD KAPILESA ON KALPAVRUKSHA VAHANAM_ కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

Tirupati, 12 February 2018: The Kalpavruksha Vahanam of Sri Kapileswara swamy on the seventh day of annual Brahmotsavam was a spiritual feast to devotees.

The Vahanam went around Kapilatheertha road, Anna Rao circle, Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony, Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans, and Kerala drums all along.

Thereafter the utsava dieties of Sri Somaskanda murthy and his consorts Sri Devi and Sri Bhudevi were given snapana thirumanjanam with milk, curd, honey, fruit juices, sandal paste. The glittering Tiruchi festival will be held in the evening.

As part of the devotional and cultural programs of Brahmotsavam students of SV Music college rendered mangala dwani, later at night the students of SV Higher Veda studies institute present Namakam, Chamakam, Rudra, Sri Sukta, Purush suktam, Parayanam. The Tirupati teams of Smt A Umamaheswari, Smt K Harita, and Smt Y Govindamma presented kolatas, Venkanna Godugu while the Sri K Pachappa team presented chakka bhajans.

SHIVA PARVATI KALYANAM ON FEB 14

As part of the ongoing Brahmotsavam at Sri Kapileswara Swamy on Feburary 14, day after Maha Shivaratri, TTD plans to organise grand Shiva Parvatula Kalyana Mahotsavam.

On the same day Arjita Kalayanotsavam is also being organised in which couples would particiapte with a ticket of Rs 250 (sold one day ahead of event) for which they will beget laddu prasam.

Dy EO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

ఫిబ్రవరి 12, తిరుపతి, 2018: శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవ క్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.

అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరుగనుంది.

ధార్మిక, సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులతో మంగళధ్వని, ఉదయం, రాత్రి వాహనసేవల్లో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నమకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుషసూక్తం పారాయణం చేశారు. వాహనసేవల్లో చంద్రగిరికి చెందిన శ్రీమతి బి.నాగరాజమ్మ బృందం, తిరుపతికి చెందిన శ్రీమతి ఎ.ఉమామహేశ్వరి బృందం, శ్రీమతి కె.హరిత బృందం కోలాట భజన, శ్రీమతి వై.గోవిందమ్మ బృందం కులుకు భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఫిబ్రవరి 14న శివపార్వతుల కల్యాణం : 

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన ఫిబ్రవరి 14వ తేదీన శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. కల్యాణోత్సవం టికెట్ల కోసం ఒక రోజు ముందుగా ఆలయం వద్దనున్న టికెట్‌ కౌంటర్‌లో సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.