SPECIAL SPIRITUAL AND CULTURAL EVENTS FOR MAHA SHIVARATHRI_ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రికి విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 12 February 2018: On the eve of the holy event of Maha Shivaratri, special devotional and cultural programs were planned by TTD as part of the ongoing Brahmotsavam of Sri Kapileswara Swamy Temple.
• On Tuesday from 6am SV Music college faculty and artists will render Mangala dwani, Shiva Purana pravachanam, Shivoham Bhananam program and Shivananda lahari bhakti music.
• At night they will stage a Mythological play, Harikatha, Chamakam, Namakam, Sri Suktam, Purusha suktam, Parayanam (Students and deathers of SV Veda Pathashala, Dharmagiri).
• Early hours 1-2.30 Annamcharya project will render Shiva Sankeertans and Harikatha in evening.
TTD appealed to all devotees to participate in large number.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రికి విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

ఫిబ్రవరి 12, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం బ్రహ్మూెత్సవాల్లో భాగంగా మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శివం పురాణ ప్రవచనం, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులతో శివోహం భజన కార్యక్రమం, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు శివానందలహరి భక్తి సంగీతం నిర్వహిస్తారు.

అదేవిధంగా సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు పౌరాణిక నాటకం, రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు హరికథ, రాత్రి 11.30 నుంచి బుధవారం తెల్లవారుజామున 1 గంట వరకు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నమకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుషసూక్తం పారాయణం చేస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శివ సంకీర్తనలు, ఉదయం 2.30 నుంచి 4.30 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శివరాత్రి నాడు స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.