LORD MAKES HIS APPEARANCE ON SARVABHOOPALA VAHANAM ON SECOND DAY OF VASANTHOTSAVAM _ స‌ర్వ‌భూపాల వాహ‌నంపై కోనేటిరాయుడు

Tirumala, 6 Apr. 20: On the second day of the ongoing annual Vasanthotsavams in Tirumala, Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi was brought to Dwajasthambha Mandapam and offered prayers before taken to Kalyanotsava Mandapam for Vasanthotsava Snapana Tirumanjanam on Monday. 

In view of the COVID 19 lockdown restrictions under vogue in Tirumala, TTD has cancelled the procession of Swarnaratham on second day of Vasanthotsavam. Instead, the deities were brought from the sanctum after second bell on Tiruchi and seated on Sarva Bhoopala Vahanam and Harati was rendered by the priests. 

Later they were taken to Kalyanotsava Mandapam on golden Tiruchi and Vasanthotsavam was performed between 2pm and 4pm. 

Temple officials and archakas in limited numbers in this solemn fete. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌ర్వ‌భూపాల వాహ‌నంపై కోనేటిరాయుడు

తిరుమల, 2020 ఏప్రిల్ 06: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన సోమ‌వారం ఉదయం 8.30 నుండి 9.00 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు. సాధార‌ణంగా వ‌సంతోత్స‌వాల్లో రెండో రోజు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ, క‌రోనా వ్యాధి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి ర‌ద్దు చేసింది.

అనంతరం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌యంలోని క‌ల్యాణ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

పౌర్ణమి గరుడుసేవ రద్దు –

ఈ నెల 7వ తేది మంగ‌ళ‌వారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని టిటిడి రద్దు చేసింది.

తుంబురు తీర్థ ముక్కోటి ర‌ద్దు –  

తిరుమ‌ల‌లో ఏప్రిల్‌ 7వ తేది మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌వ‌ల‌సిన శ్రీ తుంబురు తీర్థ ముక్కోటిని క‌రోనా వ్యాధి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.