LORD KAPILESWARA RIDES ON MAKARA VAHANAM_ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

Tirupati, 9 February 2018: On Day 4 of Sri Kapileswara Swamy Temple BTU Lord rode on Makara vahana in Somaskanda murthi avatar.

The Vahanam went around Kapilatheertha road, Anna Rao circle, Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans, and Kerala drums all along.

Makara, a transport of Ganda devi had in turn earned blessings of Shiva and become his vehicle says shaiva agama lores. Thereafter the priests performed Snapana Thirumanjanam to utsava dieties Somaskandamurthi and Kamakshi with honey, milk, curd, fruitjuices and sandal paste.

As part of the Brahmotsavam the Lord will ride on Sesha vahanam tonight symbolising Adisesha as Shiva and source of spirituality in universe.

CULTURAL EVENTS

As part of the Brahmotsvams chakka bhajans,Kolatas, Venkanna godugu, were performed by the teams from Tirupati – Smt S Dhanalakshmi,Sri K Murali, Sr K Pachappa, and Smt T Anasuyamma.

TTD local temles DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju,Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

ఫిబ్రవరి 09, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.

మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.

అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

శేష వాహనం :

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.

సాంస్కృతిక కార్యక్రమాలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో తిరుపతికి చెందిన శ్రీమతి బి.మణిమేగల బృందం, శ్రీమతి ఎస్‌.ధనలక్ష్మీ బృందం, శ్రీ కె.మురళీ బృందం కోలాట భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం, శ్రీమతి టి.అనసూయమ్మ బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీక ష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.