KALYANA VENKANNA RIDES KALPAVRUKSHA VAHANAM AS SRI RAJAMANNAR_ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

Tirupati,9 February 2018: On Day 4 of the Brahmotsavam of Sri Kalayana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram, Venkanna donned as Sri Rajagopalaswamy avatar and rode on the Kalpavruksha vahanam along with his consorts Sri Devi and Bhudevi.

He wore gold and diamond studded Chandrakolu, Dandam and classic jewellery as he blessed devotees on the four mada streets in the morning.

TTD had roped in cultural teams of Chakka bhajans, kolatas and holy drums which drove devotees esctatic with offering of camphor haratis. The kalpavruksha denoted the celestial fruits for the devotees granted by the Lord Venkateswara.

Later in the evening after Unjal seva the Lord will ride Sarvabhoopala vahaam with royal insignias denoting that Lord ruled all over the universe.

Among others DyEO of TTD local temples Sri Venkatayya, AEO Sri Srinivasulu, Executive Engineer Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 09: శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, డిప్యూటి ఇఇ శ్రీ రామూర్తి, ఇఇ శ్రీ మనోహరం, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.