LORD KAPILESWARA RIDES PURUSHUA MRUGHA VAHANAM_ పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

Tirupati, 14 February 2018: Tirupati, 14 February 2018: The devotees were thrilled as Lord Kapileswara along with consort Sri Kamakshi rode on Purusha Mruga vahanam as part of the ongoing annual Brahmotsvams of the Sri Kapileswarswami Temple here.

The glittering and floer decked Vahanam went around Kapilatheertha road, Anna Rao circle, Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony, Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans, and Kerala drums all along. Devotees were enthralled with the chakka bhajans and offered caphor harati all along the way.

In the early hours Lingadruvakala abisekam was performed before Suprabatham. Snapana Thirumanjanam was performed after vahana seva with milk, curd, honey, sandal paste, turmeric and fruit juices.

The shiva parvatula kalyanotsavam was also celebrated grand manner and later on lord rode on Aswa vahanam.

The SV Music and dance college rendered dharmic and bhakti sangeet and the students of the SV higher Vedic studies institute recited namakam, chamakam, sri sukta, purusha sukta parayanams

TTD local temles DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju,Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.

TRISHULA SNANAM ON FEB 15

On the concluding day of the Annual Brahmotsavam here ahead of the Trishula snanam, Sri Nataraja Swamy will ride Suryaprabha vahanam to bless the devotees. The celestial festival will come to an end tonight with the Ravanasura vahana seva at night.


ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

ఫిబ్రవరి 14, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారు పురుషామృగ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బ ందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ తరువాత ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆనంతరం రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ధార్మిక, సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులతో మంగళధ్వని, ఉదయం, రాత్రి వాహనసేవల్లో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నమకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుషసూక్తం పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 15న త్రిశూలస్నానం :

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన ఫిబ్రవరి 15వ తేదీన త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.