LORD SRI RAMA “CHANDRA” SHINES ON CHANDRA PRABHA VAHANAM_ చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి అభ‌యం

Tirupati, 22 March 2018: On the pleasant evening of Thursday, Lord Sri Rama Chandra Murty took out a celestial ride on Chandraprabha Vahanam.

Chandra-the moon is a symbol of cool, calm and pleasantness. Being a human, Sri Rama Chandra is revered as Lord as he is an embodiment of all good qualities. He was a great warrior yet humble to elders, magnficient ruler yet pleasant. for these qualities he amply suited his name Rama “Chandra”.

The devotees experienced a chill-thrill when they witnessed their beloved Lord Sri Ramachandra Murthy taking a pleasant ride on the cool Chandraprabha Vahanam.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి అభ‌యం

మార్చి 22, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం రాత్రి స్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది.

చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.