LORD TAKES RIDE ON “ADHIKARANANDI”_ అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 10 February 2018: On the Day -5 of the ongoing Brahmotsavam of Sri Kapileswara Temple the processional deity of Lord Shiva took celestial ride on Adhikara Nandi vahanam amidst the chanting of “Hara Hara Mahadeva Sambho Sankara” slogans reverberating all through the procession.

The Vahanam went around Kapilathirtha road, Anna Rao circle.Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans, and Kerala drums all along.

The puranas like Lingapurana illustrate the Adhikara Nandi with dark complexion, four hands carrying weapons including Shula, Gadha, Tanka and Vajra and has three eyes making sounds with of dark cloud.

There are several other stories about Nandi’s origin. According to one, Nandi was a rishi (sage) who performed such severe austerities that Shiva granted him the wish of becoming the head of his Ganas. Hence he is considered as the favourite vehicle of Lord.

Thereafter the priests performed Snapana Thirumanjanam to utsava dieties Somaskandamurthi and Kamakshi with honey, milk,curd, fruitjuices and sandal paste.

There will be a Tiruchi utsava later in the evening to showcase the devotees efforts to earn the blessings of Lord Shiva.

As part of the Brahmotsvamschakka bhajans,Kolatas,Venkanna godugu, were performed by the teams from Tirupati – Sri Manimeghala ,Smt S Dhanalakshmi,Sri K Murali, Sr K Pachappa, and Smt T Anasuyamma.

TTD local temles DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju,Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి

ఫిబ్రవరి 10, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం సోమస్కందమూర్తి అధికారనంది వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌,
వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

శ్రీకపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్టమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరుగనుంది. శివచింతన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా యోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామికి బ్రహ్మూెత్సవవేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శిస్తున్న భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో తిరుపతికి చెందిన శ్రీమతి బి.మణిమేగల బృందం, శ్రీమతి ఎస్‌.ధనలక్ష్మీ బృందం, శ్రీ కె.మురళీ బృందం కోలాట భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం, శ్రీమతి టి.అనసూయమ్మ బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.