GRAND PROCESSION OF GODDESS ANDAL MALA_ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

Tirupati, 10 February 2018: As per tradition the Andal gralands for decoration in the most significant Garuda seva tonight were brought in a grand procession from the Sri Govindaraja Swamy Temple to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram.

Devotees from all over temple participated in the grand procession named as Goda Kalana yatra which crossed SV Go samrakshana shala, Tatithopu, Perumallapalli.

The procession of the garlands on a caparisoned elephant exuded devotional potion with chakka bhajans, Kolatas and drum beating in praise of Lord Venkateswara .The garlands were adorned on the mula virat of the Sri Sri Kalyana Venkateswara temple after traditional rituals.The same garlands will decor the utsava idols of Garuda seva this evening .

Sri Sri Sri Pedda Jeeyangar Swamy, Sri Sri Sri Chinna Jeeyangar Swamy, Local Temples DyEO Smt Varalakshmi, Sri Venkataiah and AEO Sri Srinivasulu and others participated in the event.

GOLDEN CHARIOT ON FEB 11

On Day 6 of the ongoing Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy temple on Sunday, Golden Chariot, Swarna Rathotsavam will be grandly conducted in the evening along the four mada streets. Later on Lord will ride on Gaja Vahanam and bless the devotees.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి 8.00 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి
ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించే ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.

భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నది.
అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆండాళ్‌ అమ్మవారి మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. అనంతరం రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారి
అలంకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీ శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు, ఆధిక
సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 11న స్వర్ణ రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన ఆదివారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4.30 నుండి 5.00 గంటల వరకు స్వామివారు స్వర్ణ రథారోహణం చేస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గజవాహనంపై
స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.