LORD VENKATESWARA GIFTS SILK VASTRAMS ON VAYULINGESWARA-GNANAPRASOONAMBA DEVI CELESTIAL WEDDING_ శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో

Tirupati, 15 February 2018: The divine wedding ceremony of Lord Sri Vayulingeswara Swamy and Goddess Gnanaprasoonamba Devi which was held with religious fervour in Sri Kalahasti temple assumed importance with the special presentation from Lord Venkateswara Swamy.

On behalf of Lord, TTD EO Sri Anil Kumar Singhal carried the silk vastrams for the celestial occasion and presented the same to divine couple. On his arrival, EO was given warm reception by Srikalahasti Temple EO Smt Bhramaramba.

Later the Celestial wedding of the deities took place which was attended by scores of devotees. The pattu vastrams gifted by Lord Venkateswara were decked to the divine couple during Siva-Parvati Kalyanam.

Bokkasam In-charge Sri Gururaja also accompanied the TTD EO.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో

ఫిబ్రవరి 15, తిరుపతి, 2018: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణం జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణం సందర్భంగా శివ పార్వతుల ఉత్సవమూర్తులకు ఈ పట్టువస్త్రాలను అలంకరించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరకున్న టిటిడి ఈవో దంపతులకు శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి భ్రమరాంబ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ గాలిగోపురం నుండి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పట్టువస్త్రాలను ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలోని శ్రీవినాయకస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామివారిని మొదట దర్శించుకున్నారు. అనంతరం అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తరువాత స్వామి, అమ్మవారి మూలమూర్తులను దర్శించుకున్నారు.

ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధిలో టిటిడి ఈవో దంపతులను పట్టువస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలను శ్రీకాళహస్తి ఈవో అందజేశారు. ఆ తరువాత టిటిడి ఈవో తిరుమల శ్రీవారి ప్రసాదాలను శ్రీకాళహస్తి ఈవోకు అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీగురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.