LOST CASH RESTORED TO DEVOTEE _ భక్తుడు పోగొట్టుకున్న నగదు అప్పగింత
TIRUPATI, 03 DECEMBER 2022: The temple staff of Srinivasa Mangapuram have restored a cover having an amount of Rs. 44,613 lost by a devotee on Saturday.
Sri K Janardhan Setty, a pilgrim from Karnataka lost his cash cover. Vahanam Bearer Sri Muni Reddy identified the cover and handed over it to the temple staff.
Later the temple staff announced the same over the mike and restored it to the devotee who inturn thanked the sincerity and truthfulness of the temple staffs Sri Dhanasekhar and Jamedar Sri Chiranjeevulu and the Vahanam bearer.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తుడు పోగొట్టుకున్న నగదు అప్పగింత
డిసెంబరు 03, తిరుపతి, 2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న నగదును సిబ్బంది నిజాయితీగా తిరిగి అప్పగించారు.
ఆలయంలో కల్యాణోత్సవం సమయంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన శ్రీ కె.జనార్ధన్ శెట్టి రూ.44,613/- నగదు ఉన్న కవరు జారవిడుచుకున్నారు. అక్కడ వాహనం బేరర్ గా ఉన్న శ్రీ మునిరెడ్డి దాన్ని గుర్తించి అధికారులకు అప్పగించారు. ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ఏ.ధనశేఖర్, జమేదార్ శ్రీ చిరంజీవులు మైక్ లో ప్రకటన చేసి శ్రీ కె.జనార్ధన్ శెట్టికి సదరు నగదు అప్పగించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.