LOST CHILD REUNITED WITH ITS PARENTS BY CVSO_ తిరుమలలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత

Tirumala, 14 Aug. 17: With the efforts of TTD Chief Vigilance and Security Officer Sri Ake Ravikrishna, a three-year old boy reunited with his parents in Tirumala on Monday.

In the wake of heavy rush being witnessed in Tirumala which has been continuing from the past three days, a three year old boy by name Sri Ram got separated from his parents Sri Bala and Smt Meenakumari of Chennai near luggage counter at main Kalyana Katta at around 10:40am. The parents immediately informed the same to the security in PAC IV.

On receiving the information, The CVSO immediately instructed his security sleuths to search for the boy. After rigorous search by security teams for about one and a half hours and through continuous announcements the boy was found near by crying for his family members. With the help of identification marks, the security personnel traced the boy. Later the CVSO reunited the boy to his parents. The parents of the boy thanked TTD CVSO and his team for the quick response.

Apart from personally monitoring the queue lines, the CVSO also served Annaprasadam to pilgrims waiting in outside queue lines at Narayanagiri Gardens.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత

తిరుమల, 14 ఆగస్టు 2017 : తిరుమలలో సోమవారం ఉదయం తప్పిపోయిన చెన్నైకి చెందిన మూడు సంవత్సరాల బాలుడిని టిటిడి సివిఎస్వో శ్రీ అకే రవికృష్ణ తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన శ్రీ బాల, శ్రీమతి మీనాకుమారి దంపతుల మూడు సంవత్సరాల కుమారుడు శ్రీరామ్‌ ప్రధాన కల్యాణకట్ట వద్దగల లగేజి కౌంటర్‌ వద్ద ఉదయం 10.40 గంటల సమయంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు పిఏసి-4లోని భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సివిఎస్‌వో వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమల మొత్తం రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ప్రకటనలు చేయడంతోపాటు భద్రతా సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. 1.30 గంట వ్యవధిలోనే ప్రధాన కల్యాణకట్ట సమీపంలో ఏడుస్తున్న బాలుడిని కొన్ని గుర్తుల ఆధారంగా భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే బాలుడిని అతని తల్లిదండ్రులకు సివిఎస్‌వో అప్పగించారు. త్వరితగతిన స్పందించి బాలుడిని అప్పగించినందుకుగాను సివిఎస్‌వోకు, ఇతర భద్రతా సిబ్బందికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం భక్తుల క్యూలైన్లును సివిఎస్‌వో పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని బయటి క్యూలైన్లలో ఉన్న భక్తులకు సివిఎస్‌వో అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.