TTD ANNAPRASADAM-SERVING THE PILGRIMS WITH DIVINE DELICACIES_ శ్రీవారి భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు 18వ శతాబ్దంలోనే నాంది పలికిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
SAINT POETESS TARIGONDA VENGAMAMBA PIONEERED THE CONCEPT IN 18TH CENTURY
Tirumala, 14 Aug. 17: “Annadanam is Mahadanam” is the oldest saying in vedas. The temple management of Tirumala Tirupati Devasthanams (TTD) strongly believes that there is no better puja or ritual or the greatest donation other than feeding a hungry living being.
With this view, TTD has began Annadanam Scheme in the year 1985 on April 6 by the aspirations of the then Chief Minister of Andhra Pradesh Late Sri NT Rama Rao.
TARIGONDA VENGAMAMBA PIONEERED ANNADANAM IN TIRUMALA:
However it was Matrusri Tarigonda Vengamamba, the great saint poetess who pioneered the concept of free food distribution to the devotees and needy in 19th Century itself.
As per temple legend, on the divine instructions of Goddess Padamavathi Devi, the then In-charge of Hathiramji Mutt, Mahant Sri Atmaramdasji offered a small thatched hut in the present Rambhageecha gardens to Vengamamba. She used to served scores of pilgrims who visit Tirumala during this period in the premises of her residence for ten days. She carried out this noble task between 1785 AD to 1812 AD with till her last breath. Since then she became popular with the title “Matrusri” since she took care of the visiting pilgrims as a mother.
INSPIRED BY “MATRUSRI”
Following her legacy, TTD has began Annadana scheme in 1985. In the initial days, food is being served to just 2000 pilgrims on a day. But today, it has increased by many folds and on an average every day not less than 60 thousand pilgrims are relishing the “Annaprasadam” in the abode of Lord Venkateswara.
NEW ANNADANAM COMPLEX RENAMED AS “ANNAPRASADA” BHAVAN:
Annaprasdam underwent many changes in the past thirty years, but however the quality of food, the items and menu that are being served to the multitude of pilgrims remained delicious in spite of the abnormal increase of pilgrim crowd.
Another interesting feature is the mammoth Annaprasadam Complex which was inaugurated in 2011 was constructed at a cost of Rs.33crore and was named after Vengamamba as “Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex” (MTVAC) as a befitting tribute to the saint poetess.
DONATIONS POUR IN FOR ANNAPRASDAM TRUST:
So far the trust holds about Rs.850cr in the form of fixed deposits in different nationalised banks and the interest on this amount is used by the Annaprasdam department to serve food to unlimited number of pilgrims every day. The annual expenditure for Annaprasdam is around Rs.80cr. In an year, on an average about 1.75cr pilgrims are being served food by Annaprasdam Trust.
Apart from the food being served in the massive MVTAC, TTD also provides free food in PAC II, outside lines, VQC compartments, foot path routes and also in the food courts set up at CRO, PAC I and at Rambhageecha Rest House in Tirumala. While in Tirupati, the food is served in Tiruchanoor, Vishnu Nivasam, Srinivasam, Govindaraja Swamy Chowltry, SVIMS-BIRRD-Ruia Government hospitals also.
OUTSIDE SERVICES ALSO
The Annaprasadam services are also being extended by TTD during special occasions like Godavari Pushkarams, Krishna Pushkarams etc. Free food was served to multiple number of pilgrims who thronged from across the country during these special occasions.
Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal in the able guidance of Tirumala JEO Sri KS Sreenivasa Raju and Tirupati JEO Sri P Bhaskar, the Annaprasdam wing of TTD is carrying out the massive task of providing free food to the scores of visiting pilgrims every day with the able supervision of its Deputy Executive Officer Sri S Venugopal and in the expertise of Catering Officers Sri GLN Shastry and Sri T Desaiah both at Tirumala and Tirupati respectively.
VEGETABLE DONATIONS:
Every day about 15 tonnes of rice and 8 tonnes of vegetables are being utilised to prepare Annaprasdams to visiting pilgrims. While TTD purchases rice from Rice Millers Association of AP and TS, major quantity of vegetables are being procured in the form of donations from donors hailing from the states of AP, Telengana, Orissa, Tamilnadu and Karnataka. Brinjals, Pumpkin, Tomatoes, Cabbage, raddish form a major portion of the donations.
STATE OF ART-TECHNOLOGY: TTD has designed MTVAC with state-of-Art technology. Four Massive halls which has a capacity to house 1000 pilgrims in a single sitting was constructed and the pilgrims are served with “Zero” waiting time. The vegetables are stored in Cold Storage rooms and there are separate rooms to store groceries also.
SRIVARI SEVAKULU IN ANNAPRASADA SEVA
Srivari Seva volunteers who are sanctifying their lives in the fellow pilgrim service, are further blessed for their impeccable free services in Annaprasadam. The free services of Srivari Sevakulu began in the year 2000 and since then they have been offering food distribution services. Later with the advent of annaprasdam complex, their services are extended to vegetable cutting also. Every day not less than 500 Srivari Sevakulu are deputed to render services in the Annaprasadam complex, queue lines, VQCs and other areas wherever their services are required. During festival days and special occasions this figure doubles. Out of 8lakh odd srivari sevakulu who have rendered free services so far in various departments of TTD in the last 17 years, over two lakhs have rendered services exclusively in Annaprasadam department only.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు 18వ శతాబ్దంలోనే నాంది పలికిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
ఆగస్టు 14, తిరుమల, 2017: అన్నదానం మహాదానం అని పవిత్రమైన వేదాల తెలుస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదని తిరుమల తిరుపతి దేవస్థానం బలంగా విశ్వసిస్తోంది. సనాతనధర్మ పరిరక్షణ, వ్యాప్తితోపాటు అన్నప్రసాద వితరణ తదితర భక్తుల సంక్షేమ కార్యక్రమాలను టిటిడి అమలుచేస్తోంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు తిరుమల, తిరుపతిలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తోంది.
తిరుమలలో అన్నదానానికి శ్రీకారం చుట్టిన వెంగమాంబ :
భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాస్తవానికి తిరుమల పుణ్యక్షేత్రంలో 18వ శతాబ్దంలోనే అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ విషయం ఆ కాలం నాటి దానపత్రాల స్పష్టమవుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల తరువాత చెప్పుకోదగిన వారు తరిగొండ వెంగమాంబ. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించి మాతృశ్రీగా ప్రసిద్ధికెక్కారు. పురాణాల ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ప్రోద్బలంతో అప్పట్లో హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్‌జి శ్రీవారి భక్తురాలైన వెంగమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు. రాంభగీచా తోటల్లోని ఒక పూరింటిని వెంగమాంబకు కేటాయించి, నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఇతర వంట దినుసులు పంపేవారు. ఈ పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని టిటిడి నిర్మించింది.
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పట్లో ఉత్తరాన గోల్కోండ నుండి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుంచి 40 వరకు దానపత్రాలున్నాయి. ఇవి క్రీ.శ 1785 నుంచి క్రీ.శ 1812 వరకు దాదాపు 30 సంవత్సరాల కాలపరిధిలో వెలువడ్డాయి.
వెంగమాంబ స్ఫూర్తితో అన్నప్రసాద వితరణ :
తరిగొండ వెంగమాంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ టిటిడి 1985, ఏప్రిల్ 6న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ నందమూరి తారకరామారావు చేతుల మీదుగా శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో రోజుకు 2 వేల మంది తిరుమలలో అన్నప్రసాదాలు స్వీకరించేవారు. ఆ తరువాత 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. ప్రస్తుతం రోజుకు 60 వేల మందికి తగ్గకుండా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
నూతన అన్నప్రసాద భవనం :
గడిచిన 30 సంవత్సరాల వ్యవధిలో అన్నప్రసాదంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అందుకు తగ్గట్టు మరింత రుచికరంగా, శుచిగా అన్నప్రసాదాలను తయారుచేస్తున్నారు. 2011వ సంవత్సరంలో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో రూ.33 కోట్లతో అధునాతన అన్నప్రసాదం కాంప్లెక్స్ భవనాన్ని టిటిడి నిర్మించింది.
అన్నప్రసాద భవనంలో రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు ఉన్నాయి. ఒక్కో భోజనశాలలో వెయ్యి మంది చొప్పున మొత్తం నాలుగు వేల మంది భక్తులు ఎక్కడా వేచి ఉండే అవసరం లేకుండా ఒకేసారి భోజనం చేసే అవకాశముంది. ఈ భవనంలో కూరగాయలు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజి గదులు, వంట సరుకుల నిల్వ కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి.
అన్నప్రసాదం ట్రస్టుకు దాతల విరాళాలు :
శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టుకు వివిధ జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ.850 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్టు ఉన్నాయి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని భక్తులకు అన్నప్రసాదాలు అందిచేందుకు వినియోగిస్తున్నారు. ఒక సంవత్సరానికి 2 కోట్ల మందికిపైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఇందుకు గాను ఒక సంవత్సరానికి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు అవుతోంది.
ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్లు, పిఎసి-2, కాలినడక మార్గంలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అదేవిధంగా సిఆర్‌వో, పిఏసి-1, రాంభగీచా విశ్రాంతి గృహం వద్ద ఇటీవల ఫుడ్‌కోర్టులు కూడా ఏర్పాటుచేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజూ, టిటిడి అనుబంధ ఆలయాల్లో బ్రహ్మూెత్సవాల సమయాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, గోవిందరాజస్వామి సత్రాలు, స్విమ్స్, బర్డ్, రుయా ఆసుపత్రుల్లో ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
బయట ప్రాంతాల్లోనూ అన్నప్రసాద వితరణ :
టిటిడి పలు ప్రత్యేక సందర్భాల్లో బయటి ప్రాంతాల్లోనూ అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఇప్పటివరకు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల్లో విశేష సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసింది. ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్టాండుల్లో అన్నప్రసాదాలను అందిస్తోంది.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పర్యవేక్షణలో టిటిడి అన్నప్రసాద విభాగాన్ని నిర్వహిస్తోంది. అన్నప్రసాద విభాగం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారులు శ్రీ జిఎల్‌ఎన్.శాస్త్రి, శ్రీ టి.దేశయ్య ఆధ్వర్యంలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్నప్రసాదాలను అందిస్తున్నారు.
కూరగాయల విరాళాలు :
తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 15 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ల ద్వారా టిటిడి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఎక్కువ శాతం కూరగాయలు దాతల నుండి విరాళంగా అందుతున్నాయి. వంకాయలు, గుమ్మడి, టమోటా, క్యాబేజి, ముల్లంగి తదితర కూరగాయలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందిస్తున్నారు.
అన్నప్రసాద వితరణ సేవలో శ్రీవారి సేవకులు :
భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. 2000వ సంవత్సరంలో శ్రీవారి సేవ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు మరియు క్యూలైన్లు, ఉద్యోగుల క్యాంటీన్, యాత్రికుల వసతి సముదాయం -2లో భక్తులకు భోజనం, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అన్నప్రసాద భవనం, మాధవ నిలయంలో కూరగాయలు తరగడం చేస్తున్నారు. గత 17 సంవత్సరాల కాలంలో మొత్తం 8 లక్షల మంది శ్రీవారి సేవకులు టిటిడిలోని వివిధ విభాగాల్లో సేవలందించారు. అన్నప్రసాద విభాగంలో మాత్రమే ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది సేవకులు భక్తులకు సేవలందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.