LUCID KODANDARAMA KALYANAM AT VONTIMITTA _ శాస్త్రోక్తంగా రామయ్య క‌ల్యాణం

Vontimitta, 26 Apr. 21: It was a grand spectacle of Sri Sitarama Kakyanam at Sri Kodandaramaswamy temple of Vontimetta in the YSR Kadapa district on Monday night.

The divine fete organised by the TTD as part of ongoing annual Sri Ramanavami Brahmotsavam was conducted in ekantham as per Pancha Ratna Agama traditions from 8.00-10.00 pm.

The celestial event commenced at 8.00 pm under the stewardship of Kankana bhattar Sri Rakesh Bhattar with rituals- Bhagavat Vijnapana, Sabha Anjuna, Punya Havachanam and Sankalp for global well-being.

Thereafter Raksha Bandhanam, yajnopavitadharana, Vara preshana (Kanya varanam) and Madh parkarchanam were performed.

After Maha Sankalp and kanyadanam, the pravaras of both Sita and Ramachandra were recited and the family pedigree of both were chanted.

It was followed by programs of Mangala Sutra puja, Mangala Sutra Dharana and Akshataropana. The Kalyana episode concluded with Swami Nivedana, Veda Swasti, and Mahadashirvachanam.

To facilitate the devotees to become to witness the spiritual program from their homes during the Covid situation the TTD had organised the live telecast of Sri Sitarama Kalyana episode by the SVBC channel.

AP endowment minister Sri V Srinivasa Rao, Rajampeta MLA and TTD board member Sri Meda Mallikarjun Reddy, TTD JEO Smt Sada Bhargavi, DyEO Sri Ramesh Babu, Temple AEO SriMuralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా రామయ్య క‌ల్యాణం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 26: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమ‌వారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం పాంచరాత్ర ఆగమానుసారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయ ప్రాంగ‌ణంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వ‌హించారు.

కంక‌ణ బ‌ట్ట‌ర్‌ శ్రీ రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, పుణ్యాహ వచనం, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. వంశస్వరూపాన్ని స్తుతించారు. ఆ తరువాత మంగళ సూత్ర పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. అనంతరం స్వామి నివేదన, వేదస్వస్తి, ఆశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది. కరోనా వ్యాధి కారణంగా భక్తులు తమ ఇళ్ల నుండే స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ చిప్పగిరి ప్రసాద్, జెఈవో శ్రీమతి సదా భార్గవి , డిప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.