TEMPLE TO REMAIN CLOSED BETWEEN 11AM AND 9:30PM FOLLOWING TOTAL LUNAR ECLIPSE _ జనవరి 31న చంద్రగ్రహణం ఉదయం 11 గం||ల నుంచి రాత్రి 9.30 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

SRIVARI DARSHAN TO LAST ONLY FOR 4-5HRS ON JAN 31

NO ANNPRASADAMS AFTER 11AM ONWARDS

HOTELS ALSO TO REMAIN CLOSE

JEO URGES PILGRIMS TO PLAN ACCORDINGLY

Tirumala, 27 January 2018: Following total lunar eclipse on January 31, Tirumala temple will remain closed from 11am till 9:30pm and therefore the pilgrims are requested to plan their pilgrimage accordingly, urged Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala on Saturday evening, the JEO said, on that day, the darshan will last only from 8am to 10am and again from 9:30pm to 12:30midnight, hardly for five hours.

The pilgrims will not be allowed to enter into the vaikuntham queue complex compartments as there is serving of annaprasadams after 11am. Even the hotels in Tirumala too remain shut following Chandra Grahanam. “I therefore urge pilgrims to plan their pilgrimage accordingly”, he reiterated.

Meanwhile TTD has cancelled all privilege darshans on that day and limited VIP break darshan only to protocol VIPs. No recommendation letters for VIP break darshan will be entertained by JEO office on January 30, JEO asserted.

TTD has also cancelled issuance of Divya Darshan tokens for that day and also Rs.300 tickets.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 31న చంద్రగ్రహణం ఉదయం 11 గం||ల నుంచి రాత్రి 9.30 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2018 జనవరి 27: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివున్న కారణంగా శ్రీవారి దర్శనం ఉండదని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జెఈవో మీడియాతో మాట్లాడుతూ జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ తరువాత రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు.

చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదని జెఈవో తెలిపారు. విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశామన్నారు. భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.