MAHA SAMPROKSHANA FETE OF JAMMU TEMPLE ON JUNE 8 _ జూన్ 8న జమ్మూలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

VAIDIKA RITUALS BEGINS FROM JUNE 3

Tirupati,31 May 2023: TTD is organising the Ankurarpanam fete on June 3 for the Maha Samprokshana ritual slated on June 8 in the newly built Sri Venkateswara temple at Majin Village of Jammu.

The temple provides a divine ambience to devotees proceeding towards the Vaishno Devi pilgrimage.

On June 4 morning, the Vaidika programs of Panchagavya Vasana, Vastu Homam, Akalmasha Prayaschitta Homam, Raksha Bandhanam will be performed in the morning followed by Agni Pratista, Kumbhasthapana, Kumbharadhana and Vishesh Homam in the evening.

On June 5, the rituals includes Akshinmochana, Nava Kalasa Snapana, Panchagavyadhivasam, and evening rituals in the yagashala.

On June 6 the programs consisted of Navakalasa Snapanam, Ksheeradhivasam and Yagashala programs in the evening.

On June 7 the program included Jaladhivasam, Ratnanyasam, Dhatuvasam, Vimana Kalasa Sthapana, Bimba Sthapana and later in the evening Maha Shanti Tirumanjanam followed by Sayanadivasam events.

On the final day on June 8, the celestial Maha Samprokshana fête will be held in the auspicious Mithuna lagnam between 7.30am and 8.15 am.

The temple will be open for Sarva Darshan for devotees from 9.30 am onwards and in the evening a grand Srivari Kalyanotsavam will be performed.

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, several local public representatives and a large number of devotees are expected to participate.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 8న జమ్మూలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
 
– జూన్  3 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం
 
తిరుమల, 31 మే 2023: దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీటీడీ ఉత్తరాది లోని జమ్మూలో  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాత వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.
 
జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న జరుగనుంది. ఇందుకోసం జూన్ 3వ తేదీ నుండి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
జూన్ 3న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
 
జూన్ 4న ఉదయం 8 నుండి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు.
 
జూన్ 5న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిన్మోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
 
జూన్ 6న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, నవకలశ స్నపనం, క్షీరాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
 
జూన్ 7న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన(విగ్రహప్రతిష్ట), సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు.
 
జూన్ 8న ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు మిధున లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 
   
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో  శ్రీ ఎవి ధర్మారెడ్డి తో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో  భక్తులు పాల్గొంటారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.