MAHA SAMPROKSHANA HELD WITH RELIGIOUS FERVOUR _ జమ్మూలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

BALAJI TEMPLE OPENS UP FOR DEVOTEES IN JAMMU

 

JAMMU, 08 JUNE 2023: The darshan of Lord Venkateswara (Balaji) opened up for devotees in Jammu after a grand Maha Samprokshanam held on Thursday.

 

TTD has constructed a temple dedicated to Lord Venkateswara in a sprawling 62acres land donated by the Government of Jammu and Kashmir in Majin village on the banks of River Suryaputri at Rs.30cr. The Maha Samprokshanam event took place in the auspicious Mithuna lagnam between 7.30am and 8.15am. 

 

Later Kalavahanam was also performed invoking the power in the idols of the deities including Mula Virat, Padmavathi Devi, Goda Devi, Garudalwar, Jaya-Vijaya and Akshatarohanam and Brahmaghosha were performed concluding with Acharya Bahumanan.

 

DARSHAN COMMENCES

 

The devotees were allowed for darshan of Lord Venkateswara from 10am onwards. A large number of devotees from Jammu and surrounding places thronged to have darshan of Lord Balaji.

 

Lt Governor of Jammu and Kashmir Sri Manoj Sinha, TTD Chairman Sri YV Subba Reddy, Union Ministers Sri Kishen Reddy, Sri Jitender Singh, MPs Sri Prabhakar Reddy, Sri Jugal Kishore Sharma, Chief Secretary of Jammu and Kashmir Sri Arun Kumar Mehata, Mayor Sri Rajender Sharma, DDC Chairman Sri Bharat Bhushan, Divisional Commissioner Sri Ramesh Kumar were present.

 

Among other dignitaries, TTD Board members Sri Krishna Rao, Sri Milind Kesav Narvekar, New Delhi Local Advisory Committee Chairperson Smt Vemireddi Prasanthi, Chennai Local Advisory Committee Chairman Sri Sekhar Reddy also participated while among TTD officials, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, EE Sri Sudhakar, DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad, VGOs Sri Manohar, Sri Giridhar Rao, Garden Deputy Director Sri Srinivasulu, PRO Dr T Ravi, DyEEs Sri Chengalrayalu, Sri Raghu Verma, AEO Sri Krishna Rao and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జమ్మూలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
 
– భక్తులకు దర్శనం ప్రారంభం
 
జమ్మూ, 08 జూన్ 2023: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది.
 
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి,  ఆ తరువాత కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.
 
భక్తులకు దర్శనం ప్రారంభం
 
మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. జమ్మూ నగరం నుంచి పెద్ద సంఖ్యలో  భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ, తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
 
 ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు డా. జితేంద్ర సింగ్, శ్రీ కిషన్ రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు‌, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ జుగల్ కిషోర్ శర్మ, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ మెహతా, మేయర్ శ్రీ రాజీందర్ శర్మ, జమ్మూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీ భరత్ భూషణ్, డివిజనల్ కమిషనర్ శ్రీ రమేష్ కుమార్, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ గిరిధర్ రావు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇఇ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఇఇలు శ్రీ రఘువర్మ, శ్రీ చెంగల్రాయలు, ఏఈవో శ్రీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.