MAHA SAMPROKSHANAM OF SRI PADMAVATI TEMPLE IN CHENNAI IN MARCH OR APRIL- TTD JEO _ ఉత్తరాయణం తరువాత చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ- ఆలయ నిర్మాణపనులను పరిశీలించిన జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

Tirupati,19 November 2022: TTD JEO Sri Veerabrahmam said on Saturday that the Maha Samprokshanam fete of Sri Padmavati temple which is coming up in GN Chetty Road at Chennai will be conducted in March-April next after completion of the ongoing works as per schedule.

Speaking to media after an inspection of the works along with members of Chennai Local Advisory Committee and TTD officials the JEO said the construction works are on a war footing and that he gave instructions on a few pending works aimed to make the temple more comfortable for devotees Darshan.

Earlier the JEO also inspected the office of Sri Venkateswara temple at T Nagar and instructed the officials concerned to remove unwanted furniture and others and told officials to enhance the Dittam as per the turnout of devotees.

Among others he asked officials to introduce online booking for Archana, Ashirvachanam from Saturday onwards in Chennai temples and enquired about TTD temple lands, Kalyana Mandapams and Dharmashalas at Kanchipuram, Madurai, Vellore, Kanyakumari and Chennai and instructed the officials to inspect them at regular intervals.

Local Advisory Committee Chairman Sri Sekhar Reddy said the committee would extend all its support towards the completion of Sri Padmavati temple at Chennai and Srivari temple at Kanyakumari besides developing the 1.5 acres of land in Royapettah, Chennai.

TTD board member Sri Shankar, CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarlu, SE-3 Sri Satyanarayana, EE Sri Manohar, DyEO Sri Vijay Kumar were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉత్తరాయణం తరువాత చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ

– ఆలయ నిర్మాణపనులను పరిశీలించిన జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 19 నవంబరు 2022: చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణపనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తిచేసి ఉత్తరాయణం తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఆలయ నిర్మాణ పనులను శనివారం చెన్నై స్థానిక సలహా మండలి, అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ , ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చామని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసి మహా సంప్రోక్షణకు సిద్ధం చేస్తామన్నారు. ఈ ఆలయం భక్తులు దర్శించుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అంతకు ముందు జెఈవో టి.నగర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం , ఆఫీసు , ఇతర గదులు పరిశీలించారు . ఇక్కడ వృధాగా ఉన్న ఫర్నీచర్ , ఇతర వస్తువులు తొలగించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా దిట్టం పెంచుకోవాలని అధికారులకు సూచించారు . ఇక్కడి ఆలయంలో శనివారం నుంచి అర్చన, ఆశీర్వచనం సేవలకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించామని తెలియజేశారు. తమిళనాడులోని కాంచీపురం, మధురై, వేలూరు, కన్యాకుమారి , చెన్నె లోని ధర్మశాల తదితర ప్రాంతాల్లో టిటిడి కల్యాణ మండపాలు, టిటిడి స్థలాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించి వీటిని మరింతగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పారు .

చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రాయపేటలో ఉన్న 1.5 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులతో కలిసి తగిన చర్యలు చేపడతామన్నారు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శంకర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, ఎస్ఇ-3 శ్రీ సత్యనారాయణ, ఇఇ శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవో శ్రీ విజయకుమార్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.