MAHA SHANTI HOMAM TO AVOID ROAD ACCIDENTS-TTD EO _ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మహాశాంతి హోమం – టీటీడీ ఈవో

TIRUMALA, 14 JUNE 2023: In the wake of recent series of accidents on Ghat roads, as a remedial measure, seeking the divine intervention, this unique Maha Shanti Homam which is mentioned in Vaikhanasa Agama is observed today, said TTD EO Sri AV Dharma Reddy.

Speaking to media, after participating in the Maha Shanti Homam held at the Seventh Mile Sri Prasanna Anjaneya Swamy statue in the Down Ghat road on Wednesday, the EO said, the series of accidents included a overturn of an APSRTC bus, a few more accidents in the recent past, but without any major injuries to the devotees with blessings of Sri Venkateswara Swamy. Following these incidents, a meeting was conducted with the District Collector, SP and RTC RM on how to overcome these Ghat Road accidents. Simultaneously, the Agama Advisors of TTD also suggested that we perform a Homam invoking the benign blessings of Sri Srinivasa Swamy and Sri Anjaneya Swamy for the benefit of devotees. “Accordingly today we have performed this Maha Shanti Homam in front of Sri Prasanna Anjaneya Swamy to avoid such mishaps on the ghat roads in future”, he added.

Later the Agama Advisor Sri Mohana Rangacharyulu and one of the Chief Priests of Tirumala temple Sri Venugopala Deekshitulu briefed about the significance of the Homam. They said that the importance of conducting Maha Shanti Homam is mentioned in Vaikhanasa Bhagavat Shastra as a ‘Ritual of Remedy’ which will be observed whenever there are mishaps, panic situations, pandemics etc. This Homam will ensure the devotees reach their destination safely after completing their Tirumala pilgrimage, they added.

The Maha Shanti Homam commenced at 8am with Vishwaksena Aradhana, Punyahavachanam, Panchagavyaradhana, Raksha Bandhanam, Agni Pratista, Visesha Homam and concluded with Maha Purnahuti.

Tirumala temple DyEO Sri Lokanatham, Ritwiks including Sri Sitaramacharyulu, Archaka Sri Sai Swamy, Parupattedar Sri Tulasiprasad and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రోడ్డు ప్రమాదాలు జరగకుండా మహాశాంతి హోమం – టీటీడీ ఈవో

తిరుమల, 2023 జూన్ 14: ఇటీవల ఘాట్‌రోడ్లపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వాటి నివారణకు, శ్రీవారి ఆశీస్సులు కోరుతూ, వైఖానస ఆగమంలో పేర్కొనబడిన ఈ విశిష్ట మహా శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం డౌన్‌ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన మహా శాంతి హోమంలో ఈవో పాల్గొన్నారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా, మరికొన్ని ప్రమాదాలు జరిగాయన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అదే సమయంలో, భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారన్నారు. “భవిష్యత్తులో ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రోజు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహా శాంతి హోమం నిర్వహించిన్నట్లు ” ఆయన తెలిపారు.

అనంతరం ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు
కలిగినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రంలో మహాశాంతి హోమం నిర్వహించడం గురించి పేర్కొన్నట్లు తెలిపారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వారు వివరించారు.

ఉదయం 8 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది. హోమం విశిష్టతను వివరించారు.

శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఋత్వికులు శ్రీ సీతారామాచార్యులు, అర్చక శ్రీ సాయి స్వామి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.