MAHAKUMBHABHISHEKAM AT HYDERABAD SRIVARI TEMPLE ON MARCH 13_ మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

Tirupati, 7 March 2019: The holy ritual of Ankurarpanam will be performed at the newly built SRI Venkateswara temple in Jubilee Hills, Hyderabad on March 8th ahead of grand celebrations of Mahakumbhabhisekam on March 13th 6.00 to 7.30 AM of Meena lagnam.

On March 8, Friday, the evening the traditional rituals ofAcharya Ritwikvaranam, Mrutsanga Grahanam and, Vedarambham will also be performed ahead of the Ankurarpanam.

Special rituals as per Vaikhanasa Agama will be performed from March 9 to 13th the day of Maha Kumbabhisekam.

After the holy and grand event the TTD has rolled out the celestial Srinivasa Kalyanam, Utsava idol procession etc. at night ahead of Sarva darshanam and daily rituals

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

మార్చి 07, తిరుపతి, 2019: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 13వ తేదీ బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరుగనుంది. ఇందుకోసం మార్చి 8వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.

మార్చి 8న శుక్రవారం సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం కార్యక్రమాలు చేపడతారు.

మార్చి 9న శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాల వాస్తు, పంచగవ్య ప్రసన్నం, రక్షాబంధనం, అకల్మష ప్రాయశ్చిత్తహోమం, అక్షిన్మోచనం, బీమశుద్ధి, పంచగవ్యాధివాసం, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ఠ, కుంభావాహనం, కుంభారాధన, హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

మార్చి 10న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, క్షీరాధివాసం, పూర్ణాహుతి, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి చేపడతారు.

మార్చి 11న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, జలాధివాసం, పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు బింబస్థాపనం, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి జరుగనున్నాయి.

మార్చి 12న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం నిర్వహిస్తారు.

మహాకుంభాభిషేకం :

మార్చి 13వ తేదీన తెల్లవారుజామున 2.30 నుండి 5.30 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేస్తారు. ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు.

ఆ తరువాత ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.