MAHARASHTRA DEVOTEES PARAYANAMS AT TIRUMALA ASTHANA MANDAPAMS _ తిరుమల ఆస్థాన మండపంలో మహారాష్ట్ర భక్త బృందం పారాయణం

Tirumala,30,November,2020 : The week-long parayanam program by the Sri Sai Balaji Parishad of Mirajgaon in Maharashtra commenced at Asthana Mandapam on Wednesday morning.

 

TTD Chairman Sri YV Subba Reddy complimented the team members grandly felicitated the Chairman.

 

The President of Sri Sai Balaji Parishad Sri Rajendra Bhanudas Gore Maharaj, TTD board member Sri Saurabh, Chennai local advisory committee president Sri Sekhar Reddy, VGO Sri Bal Reddy and others were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

తిరుమల ఆస్థాన మండపంలో మహారాష్ట్ర భక్త బృందం పారాయణం

తిరుమల, 2022 నవంబర్ 30: తిరుమల ఆస్థాన మండపంలో మహారాష్ట్ర మీరజ్ గాన్ కు చెందిన శ్రీ సాయి బాలాజీ పరిషత్ భక్త బృందంచే వారం రోజుల పాటు నిర్వహించే పారాయణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ శ్రీ వై వి. సుబ్బారెడ్డి ఆస్థాన మండపంలో పారాయణం చేస్తున్న భక్త బృందాన్ని అభినందించారు. అనంతరం భక్త బృందం చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సాయి బాలాజీ పరిషత్ అధ్యక్షులు శ్రీ రాజేంద్ర భానుదాస్ గోర్ మహారాజ్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సౌరవ్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, వీజీవో శ్రీ బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.