శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం


శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

తిరుప‌తి, 2019 జూన్ 09: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. జూన్ 13వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

కళాకర్షణ :

సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.30 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హ‌దారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద బ‌ట్టాచార్య‌లు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌ణ దీక్షితులు, ప్రధాన కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు,ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.