“SAHASRA SEERUSHA PURUSHA” OFFERED SPECIAL “SAHASRA KALASABHISHEKAM”_ సహస్రా శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం – తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం
Tirumala, 09 Jun 19: On the auspicious occasion of the consecration of the Kautuka Beram, Bhoga Srinivasa Murthy to Tirumala temple, TTD has observed special Sahasra Kalasabhishekam on Sunday.
This celestial event took place in the Garudalwar Sannidhi between 6am and 8am. The Utsava Murthies of Sri Malayappa, Sridevi, Bhudevi, Vishwaksenulavaru and the silver idol of Sri Bhoga Srinivasa Murthy who is also known as Manavala Perumal were placed at Garudalwar Sannidhi.
While the Koutuka Beram of Manavala Perumal was seated in front of the Mula Virat at Garudalwar Sannidhi, the utsava murthies of deities and chief commander seated facing each other.
Later holy snapanam was performed to all these deities amidst chanting of Vedic hymns by pundits. A holy thread has been tied from Bhoga Srinivasamurthy idol to mula virat inside sanctorum, which indicated that as if the Sahasra Kalasabhishekam is taking place to the presiding deity.
HISTORICAL IMPORTANCE
Meanwhile, the importance of Kautuka Beram of Manavala Perumal or the Bhoga Srinivasa Murthy dates back to 7th Century AD when Sri Perundevi, the Pallava Samavai Queen presented the silver idol of Sri Venkateswara Swamy which is the exact replica of the presiding deity. TTD has commenced this festival about 13years ago to commemorate the occasion.
HH Tirumala Sri Pedda Jiyangar, Chief Priest Sri Venugopala Dikshitulu, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath, Parupatedar Sri Ramachandra were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సహస్రా శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం – తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం
తిరుమల, 2019 జూన్ 09: శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టిటిడి ఆదివారం నాడు వైభవంగా నిర్వహించింది.
ఇందులో బాగంగా ఉదయం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.
శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్ ను, అయనకు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అనగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది.
అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు.
చారిత్రక నేపథ్యం :
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్ అని కూడా పిలుస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెదజీయ్యర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఫార్‌పతేదార్ శ్రీ రామచంద్ర, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.