శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
తిరుపతి, 2019 జూన్ 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బుధవారం సాయంత్రం 3.30 నుండి 5 గంటల వరకు మూలవర్లకు మహాశాంతి అభిషేకం చేపడతారు. జూన్ 13న గురువారం ఉదయం 5 నుండి 7 గంటల వరకు పూర్ణాహుతి, పద్మప్రదక్షిణం, ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, ప్రధాన కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ లక్ష్మయ్య, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.