MAHATMA PULE PIONEERED WOMEN EDUCATION-TTD EO_ బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 11 April 2018: Mahatma Jyothi Rao Pule pioneered women education in India with and his unrelenting efforts to eradicate inequalities in the society made him “Father of Indian Social Revolution” , asserted TTD EO Sri Anil Kumar Singhal.

Mahatma Jyothi Rao Pule 191st Birth Anniversary was observed in TTD administrative building quadrangle on Tuesday.

Speaking on this occasion, EO recalled the services and sacrifices of Mahatma Pule and advocated that taking forward the ideologies taught and practiced by Pule will be the befitting tribute paid to him, he observed.

Tirupati JEO Sri P Bhaskar said, Mahatma Pule rooted out the social disparities prevalent in those days and was a visionary.

Speakers Sri Siva Bhagya Rao, IRS Retired, Sri Venkata Kishan, Divisional Administrative Officer , Manchiryala, Dr MM Vinodini remembered te tortures and sufferings he underwent from the upper class people in the society when he envisaged reformation.

They said Pule overcome all the social barriers and educated his wife Savitri Bai Pule and made her first woman teacher in the country by establishing first girls school almost some two centuries ago itself.

CVSO Sri A Ravi Krishna, BC Cell Liaison Officer Sri Ravi Prabhakar, DyEO Welfare department Smt Sneha Latha, employees were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 11: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అభివర్ణించారు. మహాత్మ జ్యోతిబాఫూలే 191వ జయంతి వేడుకలను బుధవారం టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాఫూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి కృషిచేసిన జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, వారి ఆశయాలను భావితరాలకు అందించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. టిటిడి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికి హాస్టల్‌ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాలలో ధ్యానమందిరాలు, భజనమండళ్లను నిర్మిస్తున్నామని, అర్చక శిక్షణ ఇచ్చి ఆయా ఆలయాలలో అర్చకులుగా నియమిస్తున్నామని అన్నారు.

టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ వెనకబాటు, కులతత్వం తదితర అనేక కారణాల వల్ల భారతీయ సమాజం ఇతర సమాజాల కంటే సంక్లిష్టమైందన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అవతార పురుషుడిగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, నిమ్న వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమని ఆనాడే గుర్తించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారన్నారు.

హైదరాబాద్‌కు చెందిన పదవి విరమణ తీసుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారి శ్రీ శివభాగ్యరావు మాట్లాడుతూ పూలే భారతదేశంలో మహోన్నత సంఘసంస్కర్త అని, పూలే దంపతులు సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఫూలే తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎందరో మహానుభావులు పూలేను తమ గురువుగా భావించారన్నారు.

కడప యోగి వేమన విశ్వవిద్యాలయంతెలుగు విభాగానికి చెందిన అధ్యాపకురాలు డా. వినోదిని మాట్లాడుతూ ఈ రోజు మహిళలు స్వేచ్ఛగా ఉంటున్నారంటే దానికి కారణం ఆనాడు పూలే దంపతులు వేసిన పునాదే కారణమన్నారు. వర్ణ వ్యవస్థతో కునారిల్లిన సమాజానికి సంస్కారం నేర్పిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. నిమ్నజాతుల అభివృద్ధికి సాయపడినప్పుడే ఫూలేకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు.

అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు. టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో ఆకే.రవికృష్ణ, బిసి సెల్‌ లైజన్‌ ఆఫీసర్‌ శ్రీ సి.హెచ్‌. రవి ప్రభాకర్‌, డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఎస్‌సి, ఎస్టీ, బీసీయూనియన్‌ నాయకులు, ఇతర అధికార ప్రముఖులు, టిటిడి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.