MAINTAIN QUALITY IN SUPPLY OF GHEE-TTD EO_ నెయ్యి సరఫరాలో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : టిటిడి ఈవో
Tirupati, 5 July 2017: The best possible quality of ghee should be maintained while supplying it to Tirumala temple as the major chunk is utilised towards the preparation of Laddu Prasadam, opinioned TTD EO Sri Anil Kumar Singhal.
A review meeting on supply and quality of ghee was conducted in the chambers of TTD EO Sri AK Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju. In this meeting, the Principal Scientist of National Dairy Research Institute, Bengaluru Prof Surendranath and Food Consultant from Hyderabad Sri Vijayabhaskar Reddy informed the measures to be taken to procure qualitative ghee.
The EO instructed the concerned not to compromise on the quality of desi ghee that is being supplied to TTD. “There should not be any compromise on its colour, taste and other parameters and follow the guidelines of the experts. The tender process of ghee should be more transparent”, EO added.
Additional FACAO Sri Balaji, Marketing DyEO Sri Venugopal, Health Officer Dr Sermista, SV Goshala Director Dr Harnath Reddy and other officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నెయ్యి సరఫరాలో మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : టిటిడి ఈవో
తిరుపతి, 2017 జూలై 05: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి సరఫరా అయ్యే నెయ్యి విషయంలో మరింత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో బుధవారం ఉదయం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నేషనల్ డెయిరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్(ఎన్‌డిఆర్‌ఐ)లో బెంగళూరుకు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ సురేంద్రనాథ్, హైదరాబాద్‌కు చెందిన ఫుడ్ కన్సల్టెంట్ శ్రీవిజయభాస్కర్‌రెడ్డి కలిసి నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడికి సరఫరా అవుతున్న దేశవాళీ ఆవు నెయ్యి నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉండాలని, రంగు, రుచి విషయంలో నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెయ్యి టెండర్ల ప్రక్రియలో మరింత పారదర్శకత పాటించాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, మార్కెటింగ్ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఎస్వీ గోశాల సంచాలకులు డా|| హరినాథరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.