MAJESTIC LAKSHA KUMKUMARCHANA AT SRI KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

Tirupati, 30 Aug. 19: TTD organised holy event of Laksha Kumkumarchana of Goddess Kamakshi ammavaru at TTD local temple of Sri Kapileswara temple on Friday morning.

Special attraction of the event was bangle decoration of goddess Kamakshi and Kumkumarchana along with Sri Mahalakshmi and Sri Saraswati.

The unique ritual was performed in three phases-morning, afternoon and evening

Interested devotees who participated with ₹200 ticket were presented one Laddu and kumkuma prasadam.

Later in the evening utsava idol of Kamakshi ammavaru along with Sri Kapileswara Swami was paraded on the streets of the temple town.

TTD local temples DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi and other officials participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2019 ఆగస్టు 30: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీఅమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు దిర్చి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.