MAJOR DEVELOPMENT WORKS TO BE COMPLETED BY APRIL 1-JEO _ శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో శ్రీ వీర‌బ్రహ్మం

VONTIMITTA, 28 MARCH 2022: Major part of ongoing works as scheduled for annual brahmotsavams at Vontimitta should be completed by April 1, said TTD JEO Sri Veerabrahmam.

A review meeting was held in the Officers’ Accommodation Hall at Vontimitta in YSR Kadapa district on Monday. After the inspection, the JEO held a review with all the department heads over the arrangements to be made for the ensuing mega festival which is scheduled from April 9-19 with a special focus on the state festival of Sri Sita Rama Kalyanam on April 15.

He said the annual brahmotsavams will be observed between April 10 to 18 with Ankurarpanam on April 9. On April 19 Pushpa Yagam will be observed. In view of the participation of huge number of state dignitaries for Sri Sita Rama Kalyanam on April 15, elaborate security arrangements are to be made in coordination with the local police.

He instructed the Additional Health Officer Dr Sunil to ensure that sanitary measures are taken care of both inside and outside the temple, near Kalyana Vedika etc.

The JEO directed the VGO Sri Manohar to co-ordinate with the local police over the security arrangements, traffic regulations, passes to distributed etc. to be made for the annual fete.

Later he instructed SE Electrical Sri Venkateswarulu to erect more number of LED screens for the sake of large number of devotees who are expected to converge on the day of Kalyanam. He also directed EE Smt Sumati to ensure that all the engineering works to be attended to and completed on time without any delay.

The JEO also discussed on Srivari Seva, greenery enhancement measures, cultural events to be performed, SVBC live, Annaprasadam and buttermilk, water distribution, Prasadam distribution etc.with the concerned officers and asked them to prepare a checklist of the respective departments.

SE Electrical Sri Venkateswarulu, VGO Sri Manohar, EE Smt Sumati, DyEOs Sri Gunabhushan Reddy, Sri Lakshman Naik, Sri Ramana Prasad, Additional Health Officer Dr Sunil, temple priest Sri Veena Raghavacharyulu, Tahasildar Smt Sirisha, MPDO Sri Rajendra Prasad, CI Sri Raju were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో శ్రీ వీర‌బ్రహ్మం

ఒంటిమిట్ట, 2022 మార్చి 28: పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం వెల్లడించారు. ఒంటిమిట్టలోని రాములవారి ఆలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పనులను సోమ‌వారం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, కడప జిల్లా ప్ర‌భుత్వ‌, పోలీస్ అధికారుల‌తో కలిసి జెఈవో పరిశీలించారు. మెరుగైన ఏర్పాట్ల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి కల్యాణవేదిక వద్ద జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీన శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు మెరుగైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రివర్యులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కల్యాణవేదిక వద్ద లక్ష మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్‌ మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

అనంత‌రం సివిఎస్వో మాట్లాడుతూ టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌య ప‌రిస‌రాలు, క‌ల్యాణ వేదిక వ‌ద్ద సిసి టివిలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించ‌నున్న‌ట్లు చెప్పారు. ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ వ‌ద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, ట్రాఫిక్ మ‌ల్లింపు, క‌ల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

జెఈవో వెంట ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇఇ శ్రీ‌మ‌తి సుమ‌తి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, అద‌న‌పు ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, డెప్యూటి ఈవోలు డా. ర‌మ‌ణ ప్ర‌సాద్‌, శ్రీ ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.