MAKE VIZAG DEEPOTSAVAM A HUGE SUCCESS- JEO(E & H) _ విశాఖ‌లో కార్తీక మ‌హాదీపోత్స‌వాన్ని విజ‌యవంతం చేయాలి : జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

MAKE VIZAG DEEPOTSAVAM A HUGE SUCCESS- JEO(E & H)

TIRUPATI, 08 NOVEMBER 2022: All the departments in TTD should work with co-ordination to make Karthika Deepotsavam scheduled on November 14 in Visakhapatnam, a huge success, said TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

During a review meeting held at Sri Padmavathi Rest House in Tirupati on Tuesday evening with TTD officials and donors, the JEO said all the departments should complete their respective arrangements by November 12. The marking arrangements for stage should be completed by Engineering Officials by November 10, she said.

She also instructed the concerned to set up display screens at all the vital areas along the RK Beach Road in Vizag and directed the stage to decked up in a grand manner.

She also asked the officials concerned to enlist the elite who will sit on the stage and handover the list to the donors much before for making appropriate seating arrangements.

Tirumala temple one of the chief priests Sri Venugopala Deekshitulu, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, donors and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విశాఖ‌లో కార్తీక మ‌హాదీపోత్స‌వాన్ని విజ‌యవంతం చేయాలి : జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2022 నవంబరు 08: టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి న‌వంబ‌రు 14వ తేదీన విశాఖ‌ప‌ట్నం బీచ్ రోడ్‌లో జ‌రుగ‌నున్న కార్తీక మ‌హాదీపోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె టిటిడి అధికారులు, దాత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మాట్లాడుతూ టిటిడి అధికారులు 12వ తేదీ సాయంత్రానికి విశాఖ‌ప‌ట్నం చేరుకుని త‌మ విభాగాల‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాల‌న్నారు. వేదిక నిర్మాణానికి సంబంధించి ప‌దో తేదీ సాయంత్రానికి మార్కింగ్ పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తులకు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా త‌గిన‌న్ని ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనే భ‌క్తుల‌కు పాసులు ముందుగానే జారీ చేయాల‌ని సూచించారు. తిరుమ‌ల నుండి విశాఖ‌కు వెళ్లే స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌ను టిటిడి క‌ల్యాణ‌మండ‌పానికి చేర్చి 14వ తేదీ సాయంత్రం ఊరేగింపుగా వేదిక‌కు తీసుకురావ‌డానికి దాత‌ల స‌హ‌కారంతో అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌న్నారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే కార్య‌క్ర‌మం నిర్ణీత స‌మ‌యం కంటే ఆల‌స్యం కాకుండా త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని చెప్పారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని బందోబ‌స్తు చేయాల‌న్నారు. ఉద్యాన‌వ‌న విభాగం అధికారులు వేదిక‌ను శోభాయ‌మానంగా అలంక‌రించాల‌న్నారు. వేదిక మీద ఉండే అతిథుల జాబితాను దాత‌లు ముందుగానే అంద‌జేయాల‌ని కోరారు.

ఈ సమావేశంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో శ్రీ మనోహ‌ర్, డెప్యుటీ ఈవోలు శ్రీ ర‌మేష్ బాబు, శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యం, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, దాత‌లు శ్రీ కృష్ణ ప్రసాద్ , శ్రీ రాజేష్‌,
శ్రీ హిమాంశుప్ర‌సాద్‌, శ్రీ ముర‌ళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.