MAKING BHARAT AS ”VISHWA GURU” IS POSSIBLE ONLY BY TTD’s DHARMIC ACTIVITIES _ టీటీడీ ధార్మిక కార్యక్రమాలతో భారత్ కు విశ్వగురు స్థానం- ధార్మిక సదస్సులో స్వామీజీలు
TIRUMALA, 03 FEBRUARY 2024: During the afternoon session on the first day of the three-day Dharmika Sadas held at Astana Mandapam the Pontiffs advocated that TTD alone shall make Bharat as “Vishwa Guru” through its wide range of Dharmic programs.
HH SRI VIRAJANANDA SWAMY_ BRAHMAMGARI MUTT_ KADAPA
Dharma Prachara shall be taken to the field level. Bhagavad Gita and Sanskrit learning should be taught to children through Bhajan Mandalis and Kalyana Mandapams. Children should be involved in Sankirtana and Bhajan. TTD should work hard to take the philosophy of Sri Rama and Sri Venkateswara to the people.
HH SRI STITAPRAGNANANDA SARASWATI SWAMY, UTTARA KASI
Every citizen should respect Hindu culture and tradition.
Every year TTD should organize this type of Dharmika Sadas.
Boys and girls should be guided towards Sanatana Dharma from childhood.
HH SRI PARIPURNANANDA SWAMY, VYASASHRAMAM, YERPEDU
Dharma should be propagated in every nook and corner. Dharma is the reason behind India standing as an example to the world. TTD under its Chairman and EO joint efforts will lead the Sanatana Dharma on the right path with innovative Dharmic programmes.
HH SRIHARI TEERTHANANDA SWAMIJI, SATYANANDA ASHRAMAM, NELLORE
Laudable that Sri Bhumana Karunakara Reddy is strongly determined to plant the seed of Dharma in human beings.
If the devotees donate their assets in the name of Swamy with single agenda of their devotion, TTD should ensure their protection. TTD Kalyana mandapams are lying inactive except on special auspicious days. Therefore, spiritual programs should be performed during other days.
HH SRI SATYANANDA BHARATI- CHIDANANDA AASHRAM-GANNAVARAM
Pious activities should be continued in a big way by TTD. The programs of
Dharmika Parishad should not be limited to the state only but should be universal. Conferences should not be limited to a one day activity but should be continued forever. The resolutions of Veda Sadas needs more effective implementation.
HH SRI MATHRUSRI RAMYANANDA BHARATI, SRI SHAKTI PEETHAM, RAYALACHERUVU
Hindu religion was earlier confined to India only but now it expanding globally.
The proof of this is that the number of people visiting Tirumala Srivari temple is increasing every year.
SV Bhakti Channel has a special place in promoting Hindu Sanatana Dharma.
Today even the state government has introduced digitization of education. In the same spirit, the path of Dharma should also be digitized and TTD should move ahead in this direction. TTD should design dharmic programs keeping in view small children to inculcate them ethical values from this tender age itself to make them true citizens of Bharat.
HH SRI ASHTAKSHARI SAMPATH KUMAR RAMANUJA JIYAR SWAMY- VIJAYAWADA
There are many Agama, Purana and Vedic scholars in TTD. TTD Chairman Karunakar Reddy himself is a scholar. Traditional clothing should also be implied even to common devotees while going for Darshan.
SRI SATCHIDANANDA SARASWATI- TAPOVANAM- TUNI
The distribution of Pustaka prasad should be strengthened and expanded. Its a welcoming gesture of TTD to know that they have increased the incentives to Veda Pundits. TTD should enhance community Bhajans and Bhakti programs in remote areas.
The conclave on first day concluded with the remarks by TTD EO Sri AV Dharma Reddy who thanked the participation of the Pontiffs and also for their valuable suggestions. He said, the second day sessions on Sunday will commence from 9am onwards. The Pontiffs of Kanchi, Shringeri will offer their messages virtually. By the end of the day the resolutions will be prepared if the session concludes as per schedule or else will be presented on the final day on Monday.
TTD Chairman Sri Bhumana Karunakara Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVVU VC Sri Rani Sadasivamurty, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.
టీటీడీ ధార్మిక కార్యక్రమాలతో భారత్ కు విశ్వగురు స్థానం- ధార్మిక సదస్సులో స్వామీజీలు
తిరుమల, 2024 ఫిబ్రవరి 03: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ధార్మిక సదస్సు రెండో సెషన్ లో స్వామీజీలు అనుగ్రహభాషణం చేస్తూ టీటీడీ విస్తృతంగా నిర్వహించే ధార్మిక కార్యక్రమాలతో భారత్ కు విశ్వగురు స్థానం లభించే అవకాశం ఉందన్నారు. స్వామీజీలు మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి.
శ్రీ విరజానంద స్వామి, బ్రహ్మంగారి మఠం, కడప.
ధర్మ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. భజన మండళ్ల ద్వారా పిల్లలకు భగవద్గీత, సంస్కృతం నేర్పించాలి. భజనల్లో పిల్లలను భాగస్వాములను చేయాలి. శ్రీరాముడు, శ్రీవేంకటేశ్వరుడి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేయాలి.
శ్రీ స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామి
ప్రతి పౌరుడు హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలి. ప్రతి సంవత్సరం టీటీడీ ఈ తరహా ధార్మిక సదస్సు నిర్వహించాలి. బాలబాలికలను బాల్యం నుంచే సనాతన ధర్మం వైపు నడిపించాలి.
శ్రీ పరిపూర్ణానంద స్వామి, వ్యాసాశ్రమం, ఏర్పేడు
మారుమూల ప్రాంతాల్లోనూ ధర్మ ప్రచారం జరగాలి. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి ధర్మమే కారణం. టీటీడీ ఛైర్మన్, ఈఓ సంయుక్త కృషితో వినూత్న ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయం.
శ్రీ హరితీర్థానంద స్వామీజీ, నెల్లూరు
శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారు మానవుల్లో ధర్మ బీజాలను నాటాలని దృఢ సంకల్పం చేయడం అభినందనీయం. భక్తులు టీటీడీకి ఇస్తున్న ఆస్తులకు రక్షణ కల్పించి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలి. టీటీడీ కల్యాణ మండపాలు ఖాళీగా ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.
శ్రీ సత్యానంద భారతి, చిదానంద ఆశ్రమం, గన్నవరం.
టీటీడీ ద్వారా ధార్మిక కార్యాలు పెద్దఎత్తున కొనసాగించాలి. ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలు రాష్ట్రానికే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం కావాలి. ఇలాంటి సదస్సులు కొనసాగించాలి. తీర్మానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.
శ్రీ రమ్యానంద భారతి, శ్రీ శక్తి పీఠం, రాయలచెరువు
హిందూ మతం ఇంతకుముందు భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఎస్వీ భక్తి ఛానల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యలో డిజిటలైజేషన్‌ను ప్రవేశపెట్టింది. అదే స్ఫూర్తితో ధర్మప్రచార కార్యక్రమాలను కూడా డిజిటలైజ్ చేసే దిశగా టీటీడీ ముందుకు సాగాలి. చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ధార్మిక కార్యక్రమాలను రూపొందించి, వారిలో నైతిక విలువలను పెంపొందించి వారిని నిజమైన భారత పౌరులుగా తీర్చిదిద్దాలి.
శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, విజయవాడ
టీటీడీలో చాలా మంది ఆగమ, పురాణ, వేద పండితులు ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి స్వయంగా పండితుడు. దర్శనానికి వెళ్లేటప్పుడు సాధారణ భక్తులకు కూడా సంప్రదాయ దుస్తులను సూచించాలి.
శ్రీ సచ్చిదానంద సరస్వతి, తపోవనం, తుని
పుస్తక ప్రసాదం పంపిణీని పటిష్టం చేసి విస్తృతం చేయాలి. వేదపండితులకు ప్రోత్సాహకాలను పెంచడం శుభపరిణామం. టీటీడీ మారుమూల ప్రాంతాల్లో భజనలు, భక్తి కార్యక్రమాలను పెంచాలి.
చివరగా టీటీడీ ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ విలువైన సూచనలు చేసిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. కంచి, శృంగేరి మఠాధిపతులు తమ సందేశాలను వర్చువల్‌గా అందిస్తారని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సెషన్ ముగిస్తే తీర్మానాలు సిద్ధం చేస్తామని, లేనిపక్షంలో సోమవారం సమర్పిస్తామని తెలిపారు.
టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.