MALAYAPPA BLESSES DEVOTEES ON MAJESTIC GARUDA VAHANA _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

Tirumala,11 October 2021: On the fifth day evening as a part of ongoing annual Srivari Brahmotsavams, Sri Malayappa blessed devotees on majestic Garuda Vahanam at Kalyana Mandapam.

Garuda is the favorite vehicle of Sri Maha Vishnu. Besides being the daily transport, Garuda also occupied the top slot in the Dhwajam that heralded the commencement of the Brahmotsavam

As the Key watcher of happenings around Sri Venkateswara Swamy, Garuda also supervises the entire proceedings of Srivari Brahmotsavams,says the legends.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swami, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy couple,TTD board members were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI



గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 11: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చాడు. వాహ‌న సేవ‌లో రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంటలకు హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం 4 గంట‌లకు స్వ‌ర్ణ‌ర‌థానికి బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నం, రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై శ్రీవారు కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి, మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, శ్రీ కన్నబాబు, శ్రీ కొడాలి నాని, శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు శ్రీ కరుణాకర్ రెడ్డి, శ్రీ వెంకటే గౌడ, శ్రీ ఆదిమూలం, చిత్తూరు జడ్ పి ఛైర్మన్ శ్రీ శ్రీనివాసులు, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణన్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.