MALAYAPPA ON TEPPA _ తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

Tirumala, 22 March 2024: Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi took out a colourful ride on the sacred waters of Swamy Pushkarini in the pleasant evening on Friday.

The third day of the ongoing five-day annual Teppotsavams witnessed the divinities taking three rounds of blessing devotees.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, other officials participated.

The devotees who occupied every inch of the galleries of Swamy Pushkarini were seen immersed in devotional waves chanting Govinda Namams.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తిరుమల, 2024 మార్చి 22: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై విహ‌రించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు ముమ్మార్లు విహ‌రిస్తూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.