MALAYAPPA RIDES FLOAT WITH CONSORTS _ తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

Tirumala, 16 March 2022: On the fourth day of the Srivari annual float festival (Teppotsavam) Sri Malayappa along with consorts Sridevi and Sri Bhudevi rode the richly decorated float on Wednesday evening.

Earlier the Utsava idols of Swami and Ammavaru were paraded on the four Mada streets before reaching the Pushkarini.

Sri Malayappa and his consorts took five rounds in the flower, electrical decorated glimmering float amidst Mangala vadyam, Veda parayanams by Veda pundits and sankeetans by the Annamacharya project artists.

Tirumala pontiff Sri Sri Sri Chinna Jeeyarswamy, Addl EO Sri AV Dharma Reddy, SE-2 Sri Jagdishwar Reddy, DyEO of Srivari temple Sri Ramesh Babu, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తిరుమల, 2022 మార్చి 16: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధ‌వారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై విహ‌రించారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.