MALAYAPPA RIDES PUSHPA PALLAKI _ పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ద‌ర్శ‌నం

ONE TON FLOWERS USED TO DECORATE THE FLORAL PALANQUIN

 BALANJANEYA SWAMI DECORATION STANDS AS A SPECIAL ATTRACTION

 TIRUMALA, 16 JULY 2021: On the occasion of Anivara Asthanam, Pushpa Pallaki Seva took place with utmost religious fervour in Tirumala on Friday evening along the four Mada streets between 6pm and 7pm.

Decorated with dazzling jewels, colourful silk vastrams, flanked by Sridevi and Bhudevi, Sri Malayappa Swamy took out a celestial ride to bless the devotees on this finely decked floral palanquin.

Varieties of flowers weighing about one ton are used to create this colourful palanquin by 15 florists for three days. The palanquin carried the images of Sri Rama, Sri Krishna and Balanjaneya Swamy which stood as a special attraction. 

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ద‌ర్శ‌నం

తిరుమల, 2021 జులై 16: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది.

ఆరు ర‌కాల సంప్ర‌దాయ పుష్పాలు, ఆరు ర‌కాల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు క‌లిపి దాదాపు ఒక ట‌న్ను పుష్పాల‌తో హంస ఆకారంలో ప‌ల్ల‌కీని అలంక‌రించారు. ప‌ల్ల‌కీ ముందు వైపు శ్రీ‌రాముడు, శ్రీకృష్ణుడు, మ‌ధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుక‌వైపు బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆకృతుల‌ను రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్ర‌మించి ఈ పుష్ప‌ప‌ల్ల‌కీని త‌యారుచేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.