MALAYAPPA TAKES A RIDE ON A MIGHTY WOODEN CHARIOT _ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు- వేడుకగా రథోత్సవం

TIRUMALA, 04 OCTOBER 2022: On the penultimate day of Srivari Salakatla Brahmotsavam, on the eighth day, the Malayapas Swamy along with His consorts seated on a high pedestal throne was taken on a procession around the four- Mada streets on Tuesday.

 

 

The Rathotsavam of Tirumala is significant for its salient features. It is a 35-mammoth wooden chariot being dragged by devotees and temple staff with the help of secure four-inch thick jute ropes and hydraulic brakes along the four Mada streets surrounding the temple.

 

 

The Rathotsavam has a special spiritual message embedded in the Kathopanishad which compared it to the blending of the soul with the body.

 

 

The saint poet Annamacharya says that a divine being that was an embodiment of all living things, was thus dragging his own chariot.

 

HH the senior and junior pontiffs of Tirumala, AP Minister Sri Venugopala Krishna, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, board members, other officials, a large number of devotees were present.

 
 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

– వేడుకగా రథోత్సవం

– భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

తిరుమల, 2022 అక్టోబరు 04: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలకృష్ణ, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ రామేశ్వరరావు, శ్రీ మధుసూదన్ యాదవ్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.