TTD CHAIRMAN PRESENTS PATTU VASTRAMS TO KANAKA DURGA TEMPLE _ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirumala, 04 October 2022: As part of Navaratri festival offerings TTD Chairman Sri YV Subba Reddy on Tuesday presented silk clothes to Sri Kanaka Durga temple in Vijayawada.

 

The TTD chairman and his spouse were traditionally received by temple EO Smt Bhramaramba and other officials and Archakas. Later they submitted official offerings and had Darshan of Sri Kanaka Durgamma.

 

Speaking on the occasion the TTD Chairman said on directions of the Honourable AP CM Sri YS Jaganmohan Reddy the TTD had cancelled all privileged Darshan and gave common devotees full priority and the same was done in Vijayawada temple.

 

He said facilities would be developed for TTD devotees at the Kummaripalem centre land and gold plating of Anjaneya Swami idol with the contributions of donors.

 

He said prayers were offered to Durgamma Ammavaru for good rains and well being of people and also extended Dasara greetings to all.

Delhi Local Advisory Committee  President Smt Vemireddi Prashanti was also present.

 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 4 అక్టోబరు 2022: నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు .

ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో శ్రీమతి భ్రమరాంబ ,అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు . అనంతరం చైర్మన్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు .

ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల విఐపి దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్ద పీట వేశామన్నారు . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ . కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా
దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేశారని చెప్పారు . కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు . దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు . సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని , ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలతో తులతూగేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు . రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు . టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది