MALAYAPPA TAKES PLEASURE RIDE _ తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం

Tirumala, 23 March 2024: The pleasant evening on Saturday witnessed Sri Malayappa taking a pleasure ride accompanied by His two consorts on the finely decked float.

The fourth day of Srivari Salakatla Theppotsavam mesmerized devotees with the divinities taking five rounds on the sacred waters of Swamy Pushkarini.

The floral and electrical illuminations enhanced the glory of the Teppotsavam which was a sight to behold amidst the playing of musical instruments, Veda Parayanam by Vedic scholars and Sankirtans by Annamacharya project artists.    

TTD EO Sri AV Dharma Reddy, SE-2 Sri Jagadeeswar Reddy, Temple Deputy EO Sri Lokanatham and other officials participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం

తిరుమల, 2024 మార్చి 23: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు శ‌నివారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎస్ ఇ -2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి. ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.