PUSHPA YAGA OF SRI KALYANA VENKATESWARA SWAMY ON APRIL 4 _ ఏప్రిల్ 4న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

Tirupati, 23 March 2024: The annual Puspayagam will be performed on April 4 at Srinivasam Mangapuram temple with Ankurarpanam on April 3. 

It is known that the annual Brahmotsavam was held in the temple from February 29 to March 8. Pushpa yagam is usually performed to atone for any errors committed by priests, office staff and devotees either knowingly or unknowingly. 

It is believed that by performing this, all the errors will be waived off.

As part of this, Snapana Tirumanjanam will be held for Sridevi Bhudevi Sametha Sri Kalyana Venkateswara Swamy Utsavarlu on April 4 between 10 am and 11 am. 

Pushpayagam will be held from 2 pm to 4 pm.  In this, the utsava deities will be offered a floral bath with various flowers like tulsi, chamanti, ganneru, mogali, jasmine, jaji sampangi, rose and lilies.

TTD has cancelled Astottara Sata Kalasabhishekam on April 3, Tiruppavada and Nitya Kalyanotsava Sevas on April 4 in view of the annual Pushpayagam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 4న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

తిరుపతి, 23 మార్చి 2024: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఇందులో భాగంగా ఏప్రిల్ 4న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 3న అష్టోత్త‌ర శ‌త‌క‌ళశాభిషేకం, ఏప్రిల్ 4న తిరుప్పావ‌డ‌, నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.