MANAGUDI PUJA MATERIALS GETS READY _ ”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం

Tirupati, 24 November 2017: The Managudi puja material set ready to get dispatched to the respective temples in AP and TS. The packing of the material took place in SVETA bhavan in Tirupati on Friday under the supervision of HDPP officials.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI–

”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం

తిరుపతి, 2017 నవంబరు 24: ప్రఖ్యాత హైందవ దార్మిక సంస్థ అయిన టిటిడి ధర్మప్రచారంలో భాగంగా డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు మనగుడిని ఘనంగా నిర్వహించనున్నారు. మనగుడి కార్యక్రమం నిర్వహణ కోసం ఆలయాలకు చేరవేసే అక్షింతల తయారీ కార్యక్రమం శుక్రవారం తిరుపతిలోని శ్వేతా భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అక్షింతలు తయారు చేశారు.

డిసెంబరు 1న హనుమంత వ్రతం, డిసెంబరు 2న కృత్తిక దీపొత్సవం, డిసెంబరు 3వ తేదీ దత్తజయంతిని పురస్కరించుకొని టిటిడి మనగుడి కార్యక్రమాన్ని నిర్దహిస్తుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని యసి, యస్టీ, బిసి కాలనీలలో ఎంపిక చేయబడిన 300 ఆలయాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్‌చేసి ఆయా ఆలయాలకు డిపిపి ద్వారా పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణరెడ్డి, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీ గురునాథం, శ్రీవారి సేవకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.