MANAGUDI SARE GETS LORD’S BLESSINGS_ ”మనగుడి”తో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి ఈవో

Tirumala, 24 November 2017: As the eleventh phase of Managudi is set to be observed from Decembe 1 to 3, the puja items including holy threads, Govinda Kanakanams received the blessings of Lord Venkateswara in Tirumala on Friday before they were dispatched to the selected temples located in AP and TS.

Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, Managudi is a massive temple festival commenced five years ago with a noble aim to enlighten general public especially youth on Hindu Sanatana Dharma and values embedded in our rich tradition and culture. He said following the instructions of Honourable CM of AP Sri N Chandrababu Naidu to extend the dharmic activities in a big way, TTD will observe Managudi in the holy month of Karthika in the notified 300 temples located across two telugu speaking states from December 1 to 3. He said on first day there will be Alaya Sobha, followed by Karthika Deepotsavam and on final day Gurupoojotsavam in connection with Datta Jayanthi will be celebrated.

Adding further he said, as a part of Dharma Prachara, TTD has sanctioned Rs.10crores to construct 500 temples in SC, ST colonies. Besides temples are also coming up in Agency areas including Araku, Rampachodavaram, Parvathipuram, Sitapet at a cost of Rs.4.5crores”, he informed.

The EO said, a new temple of Lord Venkateswara will soon come up in Bhuvaneshwar in Orissa on the request of the devotees.

Earlier Tirupati JEO Sri P Bhaskar carried the kankanams over his head from Bedi Anjaneya Swamy temple inside Tirumala temple to get the divine blessings.

HDPP Secretary Sri Ramakrishna Reddy, Project Officer Sri Ramana Prasad, AEO Sri Nageswara Rao were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI–

”మనగుడి”తో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి ఈవో

పూజాసామగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

తిరుమల, 2017 నవంబరు 24: టిటిడి ధర్మప్రచార కార్యక్రమాల్లో మనగుడి కార్యక్రమానికి ప్రత్యేకస్థానం ఉందని, సనాతన ధర్మాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు ఇది దోహదపడుతోందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం మనగుడి పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మనగుడి పూజాసామగ్రిని శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.

అనంతరం ఈవో మీడియాతో గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధర్మప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 300 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అక్షింతలు, పసుపుకుంకుమ, కలకండ, పుస్తక ప్రసాదం, కంకణాలతో కూడిన పూజాసామగ్రిని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ పూజాసామగ్రిని ఎంపిక చేసిన ఆలయాలకు చేరవేస్తామన్నారు. డిసెంబరు 1న ఆలయశోభ, డిసెంబరు 2న క త్తిక దీపోత్సవం, నగర సంకీర్తన, స్థానిక భజన బ ందాలతో భజనలు, డిసెంబరు 3వ తేదీ దత్తజయంతిని పురస్కరించుకుని గురుపూజ నిర్వహించనున్నట్టు వివరించారు.

ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి గ్రామాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఇందుకోసం ఇప్పటికే రూ.10 కోట్ల నిధులు మంజూరుచేశామని ఈవో తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, రంపచోడవరం, పార్వతీపురం, శీతంపేటలో రూ.4.5 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. భక్తులు కోరిన పక్షంలో టిటిడి సమాచార కేంద్రాలు గల నగరాల్లో ఆలయాల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. భువనేశ్వర్‌లో టిటిడి సమాచార కేంద్రం, కల్యాణమండపం ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు త్వరలో అక్కడ శ్రీవారి ఆలయం నిర్మిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.