MANAGUDI HOLY INGREDIENTS PREPARATION COMMENCED BY TIRUPATI JEO_ ”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్
Tirupati, 5 Aug. 19: The preparation of sacred rice – Akshatalu for the Sravana Pournami Managudi programme mulled by TTD from August 9-15 in two Telugu States has commenced in SVETA building at Tirupati by JEO Sri P Basant Kumar.
Speaking on this occasion, the JEO said, the 19th phase of Managudi programme will be observed in around 11500 temples across AP and TS for a week starting from August 9 with Varalakshmi Vratam. Remaining days there will be religious discourses by eminent local scholars in the respective temples on Ramayanam, Mahabharatam and Bhagavatam. On the final day on August 15, the importance of Sravana Pournami will be narrated”, he added.
Earlier, the preparation of holy rice – Akshatalu commenced with Puja. Srivari Seva Volunteers took part in the preparation of the sacred rice packets. Along with them kankanams, sugarcandy will also be dispatched to all the temples which will be distributed among the local devotees.
HDPP Secretary Dr Ramana Prasad, AEO Sri Nageswara Rao and others also took part.
”మనగుడి” పూజ సామగ్రి సిద్ధం: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్
తిరుపతి, 2019 ఆగస్టు 05: ప్రఖ్యాత హైందవ దార్మిక సంస్థ అయిన టిటిడి సనాతన ధర్మప్రచారంలో భాగంగా ఆగస్టు 09 నుండి 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ”మనగుడి” కార్యక్రమం నిర్వహణ కోసం ఆలయాలకు చేరవేసే అక్షింతల తయారీ కార్యక్రమం సోమవారం తిరుపతిలోని శ్వేతా భవనంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అక్షింతలు తయారు చేశారు.
ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో 19వ విడత మనగుడి కార్యక్రమం జరుగనుందని తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 11,500 ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్‌చేసి ఆయా ఆలయాలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. భజనలు, సంగీతం, కుంకుమార్చన, దీపారాధన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా ఆలయాలలో ఈ నెల 9వ తేదిన వరలక్ష్మీ వ్రతం విశిష్టతపై ధార్మిక ప్రసంగం, 10వ తేది నుండి 14వ తేదీ వరకు రామాయణ, మహాభారత, భాగవతంలపై ధార్మిక ప్రసంగం, 15వ తేదీన శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ధార్మిక ప్రసంగాలు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి డా. రమణ ప్రసాద్, ఏఈవో శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీ ఎం. గురునాథం, అర్చక శిక్షణ సమన్వయకర్త శ్రీ చెంచు సుబ్బయ్య, ప్రత్యేకాధికారి శ్రీ ఈ.జీ. హేమంత్ కుమార్, శ్రీవారి సేవకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.