MANAGUDI FOR PROPAGATION OF SANATANA DHARMA- TIRUPATI JEO_ భారతీయ సనాతనధర్మ పరిరక్షణకే ‘మనగుడి’ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirupati, 8 Aug. 19: TTD Joint Executive Officer, Sri P Basant Kumar said that the objective of the Hindu Dharma Prachara Parishad was to enhance spiritual values in society and impart knowledge of temple culture amongst the youth.
Earlier the JEO flagged off the vehicles of Managudi puja materials at the SVETA complex on Thursday, for the conduction of the 19th edition of Managudi Program all over the two Telugu states.
He said the Puja material includes Akshatas, vermilion, turmeric, sweet candy, were sent for the event which will be beginning August 9 and concludes on August 15 in over 11,500 temples of both Telugu states.
HDPP secretary Sri Ramana Prasad, AEO Sri Nageswar Rao, Superintendent Sri Gurunatham, Coordinator of archaka training Sri Chenchu Subbaiah and OSD Sri EG Hemant Kumar also participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భారతీయ సనాతనధర్మ పరిరక్షణకే ‘మనగుడి’ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుపతి, 2019 ఆగస్టు 08: సమాజంలో సనాతన భారతీయ హైందవ ధర్మ విలువలు నింపి, భావితరాలకు ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 19వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ తెలిపారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించిన మనగుడి పూజా సామగ్రిని ఆయా ఆలయాలకు తరలించే వాహనాలను జెఈవో జెండా ఉపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 9 నుండి 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 11,500 ఆలయాలలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమం కోసం అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని చేరవేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ఆలయాల్లో భజనలు, సంగీతం, కుంకుమార్చన, దీపారాధన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో మనగుడి కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు.
ముందుగా శ్వేతా భవనంలో జెఈవో దంపతులు మనగుడి పూజ సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రమణప్రసాద్, ఏఈవో శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీ ఎం. గురునాథం, అర్చక శిక్షణ సమన్వయకర్త శ్రీ చెంచు సుబ్బయ్య, ప్రత్యేకాధికారి శ్రీ ఈ.జీ. హేమంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.