TARIGONDA VENGAMAMBA A SOCIAL REFORMER, SAYS TIRUPATI JEO_ సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirupati, 8 Aug. 19: TTDs Tirupati Joint Executive Officer Sri P Basanth Kumar says the poetess Matrusri Tarigonda Vengamamba had popularised the Srivari glory in simple language for common man to understand and follow.
Participating in the 202nd vardhanti of the poetess held at Annamacharya Kala Mandir on Thursday the JEO said the ardent devote of Sri Venkateswara, she was a yogini, social reformer and poetess.
He said TTD organised the vardhanti utsavam at Tirumala, Tirupati and Tarigonda with two day long festivities, Bhakti sangeet, harikatha, and literary discourses by eminent Acharya’s.
Earlier he garlanded portrait of the poetess and felicitated the Acharya’s with shawls and prasadams.
Prominent among those who participated in the literary convention on Tallapaka Annamacharya and Tarigonda Vengamamba were Acharya KG Krishnamurthy. Acharya Sri G Anjaneya Shastri Of Varanasi spoke on Tarigonda Vengamamba and Vasishta Ramayana significance. Dr A. Vibhishana Sharma Of Tirupati, Dr Sangeetam Keshavuku Of Chandra girl also spoke.
A colourful cultural program followed the convention where artists rendered gatra ganam, sankeertans etc.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుపతి, 2019 ఆగస్టు 08: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ తెలిపారు.తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం తరిగొండ వెంగమాంబ 202వ వర్థంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో ప్రసంగిస్తూ వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు తిరుమల, తిరుపతి, తరిగొండలలో రెండు రోజులపాటు భక్తి సంగీతం, హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ ఆచార్యులతో సాహితి సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు శ్రీవారి, తరిగొండ వెంగమాంబ చిత్ర పటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం జెఈవో సాహితీ సదస్సులో పాల్గొనే ఆచార్యులను శాలువా, శ్రీవారి తీర్థ ప్రసాదాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆచార్యులతో వెంగమాంబ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన సాహితీ సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ”తాళ్లపాక అన్నమాచార్యులు – తరిగొండ వెంగమాంబ ‘ ‘ అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా వీరిరువురు గ్రాంథికం, వ్యవహారిక భాషలను సమన్వయం చేసుకుని రచనలు చేసి ప్రజాకవులుగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. ఆళ్వార్లు తమను నాయికలుగా భావించి మధురభక్తితో శ్రీవారిని కొలిచారని, అన్నమయ్య, వెంగమాంబ కూడా అదే విధానాన్ని అనుసరించారని తెలిపారు. అన్నమయ్య సంస్కృతంలో వేంకటాచల మహత్యాన్ని రచించినా అది లభ్యం కాలేదని, వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు.
108 దివ్య దేశాలలో నాలుగుటికి విశేష ప్రాశస్త్యం ఉందన్నారు. ఇందులో తిరుమల – పుష్పమండపం, కంచి – త్యాగ మండపం, శ్రీరంగం – భోగ మండపం, మేల్‌కోటై – జ్ఞాన మండపంగా ప్రసిద్ధి చెందినట్లు వివరించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నమయ్య ప్రవేశపెట్టిన లాలిపాట, వెంగమాంబ అమలుచేసిన ముత్యాలహారతి ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.
అనంతరం వారణాసికి చెందిన ఆచార్య జి.ఆంజనేయశాస్త్రీ ”తరిగొండ వెంగమాంబ – వాశిష్ఠ రామాయణ వైశిష్ట్యం” అనే అంశంపై మాట్లాడుతూ వాల్మీకి మహాముని సాంస్కృతంలో ‘యోగ వాశిష్ట్య రామాయణం’ రచించారన్నారు. దీనిని వెంగమాంబ సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళమైన భాషలో లోకానికి అందించినట్లు తెలిపారు. ఇందులో జగత్ ఎలా పుట్టింది, జీవుడు ఎలా పుడతాడు, కర్మ సిద్ధాంతం, తదితర అంశాలను ఉదాహరణలతో వివరించారు.
తిరుపతికి చెందిన డా|| ఆకెళ్ల విభీషణ శర్మ ”శ్రీవేంకటాచల మహత్యం – పురాణాల ప్రభావం”, చంద్రగిరికి చెందిన డా|| సంగీతం కేశవులు ”శ్రీవారి భక్తులలో తరిగొండ వెంగమాంబ స్థానం విశిష్టత ” అనే అంశాలపై ఉపన్యసించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ జి.ఉదయ్ భాస్కర్ రెడ్డి, కుమారి కోనేరు క్ష్మీరాజ్యం బృందం గాత్ర సంగీతం కార్యక్రమం నిర్వహించారు.
కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన డా|| పి.రమణవాణి మరియు డా|| జి.ఆశా దీపిక బృందం గాత్ర సంగీతసభ జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.