“MANAGUDI AIMED AT ENLIVEN THE VALUES IN ARSHADHARMA”– TTD EO _ ఆర్షధర్మ పరిరక్షణకు మనగుడి హేతువు-మనగుడి ప్రారంభ కార్యక్రమంలో తితిదే ఈవో
ఆర్షధర్మ పరిరక్షణకు మనగుడి హేతువు
మనగుడి ప్రారంభ కార్యక్రమంలో తితిదే ఈవో
తిరుపతి, ఆగస్టు-21, 2013: ప్రపంచానికి హైంధవ సనాతన ధార్మిక విలువలు చాటిన భారతదేశం భావితరాలకు ఆర్షధర్మ విలువలను అందించడానికి నిర్దేశించబడిన బృహత్తర కార్యక్రమం మనగుడి అని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎమ్.జి.గోపాల్ అన్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రజల్లో ధార్మిక చైతన్యం నింపేందుకు తితిదే, దేవాదాయ శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా 21వేలకు పైగా దేవాలయాలలో చేపట్టిన 3వ విడత మనగుడి ఉత్సవం బుధవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాలలో మనగుడి కార్యక్రమాన్ని తితిదే ఈవో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థిథ నుండి విద్యతో పాటు దైవచింతనను అలవాటు చేసుకోవాలని సూచించారు. పవిత్ర శ్రావణ పౌర్ణమి, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అయిన శ్రవణం రోజున తమకిష్టమైన దైవాలను ప్రార్థిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయశోభ, కుంకుమార్చన, గోపూజా, సామూహిక సత్యనారాయణ వ్రతం,వరలక్ష్మి వ్రతం వంటి అనేక కార్యక్రమాలలో ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో తమతమ ఆలయాలలో నిర్వహించడం చిరస్మరనీయం అన్నారు. మనగుడి మొదటి విడత 13,800 ఆలయాలల్లో, రెండవ విడత 17,200ల ఆలయాలల్లో, మూడవ విడత 21,142లకు పైగా ఆలయాలల్లో నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ధూపదీపాలు నోచుకోని ఆలయాలు సైతం మనగుడి కార్యక్రమం ద్వారా దేదీప్యతను సంతరించుకున్నాయని తెలిపారు.
ప్రకృతి మాత కరుణించి దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా భాసిల్లాలంటే గోసంరక్షణ, యజ్ఞయాగాలు, సహేతుకంగా నిర్వహించాలన్నారు. అప్పుడే ప్రకృతి మాత సహితం సహకరించి సకాలంలో వర్షాలు కురిసి తద్వారా పాడిపంటలు సంవృద్ధిగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో సమన్వయంతో ఆనందంగా జీవించగలుగుతారు ఈవో పేర్కొన్నారు.
అంతకు పూర్వం శ్రీనివాస వాజ్ఞ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా||మేడసాని మోహన్ మనగుడి ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేవాలయం, సంస్కృతి పరమపవిత్రమైనదని, అత్యంత ప్రాచీనమైనదని అభివర్ణించారు. భావితరాలవారికి దేవలాయాల యొక్క ఆవశ్యకతను, ప్రాశస్త్యాన్ని తెలపడానికే మనగుడి కార్యక్రమం రూపొందించబడిందని తెలిపారు.
మనగుడి కార్యక్రమంలో పాల్గొన్న తితిదే చైర్మన్‌ః-
పశ్చిమగోదావరి జిల్లా కళ్ళ మండలంలోని కాలకూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన మనగుడి కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీకనుమూరి బాపిరాజు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు హిందూదేవాలయాల వైశిష్ట్యాన్ని తెలియజేసేందుకు తితిదే, రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖతో కలసి 3వ విడత మనగుడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజలు ఎంతో భక్తి విశ్వాసాలతో పాల్గొనడం అత్యంత ఆనందకరం అన్నారు.
కాగా తితిదే తిరుమల జ.ఇ.ఓ.శ్రీ.కె.ఎస్.శ్రీనివాసరా
అదేవిధంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఎస్వీ ప్రాచ్య కళాశాల, పాఠశాలలో, తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో మనగుడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో మొత్తం 100కు పైగా దేవాలయాల్లో మనగుడి ఉత్సవం నిర్వహించారు.
తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట యానాది కాలనీలోని శ్రీగంగమ్మ ఆలయంలో జరిగిన మనగుడి కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీజి.వి.జి. అశోక్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోతున్న నేటి యువతలో ధార్మిక చైతన్యాని నింపేందుకు మనగుడి కార్యక్రమం చక్కగా ఉపయోగ పడుతుంది అన్నారు. హిందూసాంప్రదాయానికి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా తితిదే దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాథ్, ఉపకర్యానిర్వహణాధికారి శ్రీ.ఇ.ఉమాపతి రెడ్డి, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జ్ఞానకుమారి, స్విమ్స్ డైరెక్టర్ డా|| వెంగమ్మ ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ పరిసరాల్లో పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు మహద్వారం చెంత రక్షాకంకణాలు పంపిణీ చేశారు.
–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.